Ghani Movie: వరుణ్ యాక్షన్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

లవర్ బాయ్ గా అట్రాక్ట్ చేశాడు.. పక్కింటి కుర్రాడిలా పలకరించాడు.. ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు మెగాప్రిన్స్. గని లుక్ తన ఇమేజ్ ను..

Ghani Movie: వరుణ్ యాక్షన్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

ghani

Ghani Movie: లవర్ బాయ్ గా అట్రాక్ట్ చేశాడు.. పక్కింటి కుర్రాడిలా పలకరించాడు.. ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు మెగాప్రిన్స్. గని లుక్ తన ఇమేజ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తుందని సమ్ముతున్నాడు. మెగాహీరోల్లో తనకంటూ సపరేట్ ట్రాక్ క్రియేట్ చేసుకుంటోన్న వరుణ్ యాక్షన్ ప్లాన్ ఈసారైనా వర్కవుట్ కాబోతుందా అన్నది చూడాలి.

Ghani: యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ట్రైలర్

పక్కా మేకొవర్ తో గని కోసం ఫిట్ గా తయారయ్యాడు వరుణ్ తేజ్. లవర్ బాయ్ ఇమేజ్ కు భిన్నంగా రగ్డ్ అండ్ రఫ్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన గని ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ వేరియేషన్ కోసం మెగాప్రిన్స్ బాగానే కష్టపడ్డట్టు తెలుస్తోంది. ఫన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటే హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో బాక్సింగ్ గనిగా వరుణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు.

Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!

మెగా హీరోల్లో తనకంటూ స్పెషల్ క్యాటగిరీ క్రియేట్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేశ్ లో విలనిజం.. లోఫర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ చూపించినా.. ప్రేక్షకులు మాత్రం కంచె, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2ల్లోని పక్కింటి కుర్రాడిలానే వరుణ్ ని రిజిస్టర్ చేసుకున్నారు. సో కాస్త ఆ యాంగిల్ కి బ్రేక్ ఇస్తూ గని కోసం ఫిట్ గా మారి బాక్సింగ్ రింగ్ లోకి దూకాడు వరుణ్ తేజ్.

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

ఇదివరకు చూడని వరుణ్ తేజ్ ని గని సినిమాలో ప్రెజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి. సూపర్ పర్సనాలిటి.. అంతకు మించిన అగ్రెసివ్ మోడ్ లో వరుణ్ యాక్షన్ లుక్ హైలైట్ గా మారనుంది. హీరోయిన్ సయీ మంజ్రేకర్ తో పాటూ నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి కాస్టింగ్ తో రిచ్ లుక్ తీసుకొస్తున్నారు గీతా ఆర్ట్స్ మేకర్స్. మొత్తానికి పవర్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీగా తయారైన గని చాలా వాయిదాల తర్వాత ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది. మరి వరుణ్ కు కావాల్సిన పూర్తి యాక్షన్ లుక్ ను తీసుకొస్తుందా అన్నది చూడాలి.