Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ నటిస్తున్న బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘గని’ రిలీజ్ కోసం రెండు డేట్స్ అనుకుంటున్నారు మేకర్స్..

Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!

Ghani

Ghani: టాలీవుడ్ ఇండస్ట్రీలో గతకొద్ది రోజులుగా అయోమయ పరిస్థితి నెలకొంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వాయిదా పడ్డ సినిమాల పరిస్థితి ఏంటి?.. కొత్తగా డేట్ అనౌన్స్ చేసిన సినిమాల సంగతేంటి?.. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాల విషయం పక్కన పెడితే అసలు చిన్న సినిమా పరిస్థితి ఏంటి?.. నానా గందరగోళంగా ఉన్న టాలీవుడ్‌లో సోమవారం సాయంత్రం మళ్లీ సందడి మొదలైంది.. వరుసగా ఐదు క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు మరో సినిమా ఈ లిస్టులో వచ్చి చేరింది.

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Acharya: ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లో హీట్ పెంచనున్న పెద్ద సినిమాలు

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.

Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్..

సంక్రాంతి కానుకగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న స్పెషల్‌ సాంగ్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. ముందుగా గతేడాది దీపావళికి రిలీజ్ అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 24కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు రెండు డేట్స్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో ‘గని’ బాక్సింగ్ పంచెస్ విసరబోతున్నాడు.

F3 Movie : హాట్ సమ్మర్‌లో కూల్ ఫన్.. ‘ఎఫ్ 3’ వచ్చేస్తోంది..