Ghani: కొడ్తే.. అంటూ అందాలతో కొట్టిన తమన్నా!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.....

Ghani: కొడ్తే.. అంటూ అందాలతో కొట్టిన తమన్నా!

Tamannaah In Kodthe Song From Ghani

Updated On : March 24, 2022 / 12:34 PM IST

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Ghani: యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ట్రైలర్

తాజాగా ఈ సినిమాలోని ‘‘కొడ్తే..’’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అదిరిపోయే అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్స్ బాగున్నాయి. ఇక చాలా రోజుల తరువాత తమన్నాను ఇంత హాట్‌గా చూశామని ప్రేక్షకులు అంటున్నారు. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రెయినింగ్ తీసుకున్నాడు. కాగా ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు వరుణ్ భారీ వర్కవుట్స్ చేసి చక్కటి ఫిజిక్‌లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

తొలిసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తున్న వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి యాక్టర్స్ నటిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గని చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.