Prabhas : ‘రాధేశ్యామ్’ కోసం రాజమౌళి.. శివ రాజ్‌కుమార్.. పృథ్వీరాజ్

'రాధేశ్యామ్' సినిమాకి తెలుగులో డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఇవ్వనున్నారు. ఇక కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ అన్న స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ చేత రాధేశ్యామ్‌కి వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు..

Prabhas : ‘రాధేశ్యామ్’ కోసం రాజమౌళి.. శివ రాజ్‌కుమార్.. పృథ్వీరాజ్

Radheshyam

 

Radheshyam :  ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరెక్కిన సినిమా ‘రాధేశ్యామ్’. 1980లలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఓ లవ్ స్టోరీ, కొన్ని రియల్ అంశాలని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘రాధేశ్యామ్’ సినిమాని మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి.

ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీలో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో సినిమాకి మరింత హైప్ వచ్చింది. బాలీవుడ్ మార్కెట్ కోసం అమితాబ్ సాయం కోరగా ఇప్పుడు మిగిలిన భాషల్లోనూ ఒక్కొక్కరితో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు.

Ajith : ‘వలిమై’ రన్ టైమ్‌లో కోత.. 14 నిముషాలు తగ్గింపు..

‘రాధేశ్యామ్’ సినిమాకి తెలుగులో డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఇవ్వనున్నారు. ఇక కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ అన్న స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ చేత రాధేశ్యామ్‌కి వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు. మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీంతో అన్ని భాషల్లో ఈ సినిమా పై మరింత హైప్‌ని క్రియేట్ చేశారు. అయితే తమిళ్‌లో రాధేశ్యామ్‌కి ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారో ఇంకా ఫైనల్ అవ్వలేదు. అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.