Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''ప్రస్తుత సమాజానికి F3 మూవీ ఎంతో అవసరం. ప్రతి మనిషికి నవ్వు అవసరం, ఆ నవ్వులు పంచే సినిమా F3. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి. వాటన్నింటికి పరిష్కారం నవ్వు. నేను 40 ఏళ్లుగా...............

Rajendra Prasad :  ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..

Rajendra Prasad

Rajendra Prasad :   వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా F3. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. F2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది.

ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించి అందర్నీ నవ్వించనున్నారు రాజేంద్రప్రసాద్. ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ”ప్రస్తుత సమాజానికి F3 మూవీ ఎంతో అవసరం. ప్రతి మనిషికి నవ్వు అవసరం, ఆ నవ్వులు పంచే సినిమా F3. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి. వాటన్నింటికి పరిష్కారం నవ్వు. నేను 40 ఏళ్లుగా నవ్వును నమ్ముకొని ఉన్నాను. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీశారు.

Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!

ఈ మూవీ హిట్ కాకపోతే గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా మళ్లీ మీ ముందు నేను ఎప్పుడూ నిలబడను, మీకు మళ్ళీ కనపడను. ఈ సినిమా మీద అంత నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయి. F3 సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా” అని అన్నారు.