Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!

ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా తయారయ్యారు. పెరిగిన టికెట్ రేట్ కూడా వాళ్లని ఎక్కువగానే భయపెడుతోంది. చిన్న సినిమాకెళ్లాలన్నా పెద్ద రేట్ ఆడియెన్స్ కి అడ్డంకిగా మారుతోంది. దీంతో జనం థియేటర్స్ కి రాక చాలా సినిమాలే నష్టపోతున్నాయి.

Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!

Movie Ticket Rates

Movie Ticket Rates: ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా తయారయ్యారు. పెరిగిన టికెట్ రేట్ కూడా వాళ్లని ఎక్కువగానే భయపెడుతోంది. చిన్న సినిమాకెళ్లాలన్నా పెద్ద రేట్ ఆడియెన్స్ కి అడ్డంకిగా మారుతోంది. దీంతో జనం థియేటర్స్ కి రాక చాలా సినిమాలే నష్టపోతున్నాయి. అందుకే తన సినిమాను మాత్రం రెగ్యులర్ రేట్స్ కే చూడొచ్చు అంటున్నారు దిల్ రాజు. ఫ్యామిలీతో వచ్చి వెంకీ, వరుణ్ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ను ఎంజాయ్ చేయమంటున్నారు. అయితే మేము టికెట్ రేట్స్ పెంచట్లేదని చెప్పుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారింది.

Ticket Rates: పెరిగిన టికెట్ రేట్లు.. సినిమాకు వరమా.. శాపమా?

ఇలా వీడియో రిలీజ్ చేసి మరీ మేము టికెట్ రేట్స్ పెంచట్లేదని చెప్పేసారు దిల్ రాజు. మే 27న రిలీజ్ కానున్న ఎఫ్3ను నార్మల్ రేట్స్ కే థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చనేది దిల్ రాజు వెర్షన్. డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సునయన మధ్య చిన్న డ్రామాను ప్లే చేసి ‘ఎఫ్ 3’ సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడం లేదని స్పష్టం చేశారు. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే టికెట్ అమ్ముతారనే ఓ హామీని నిర్మాత దిల్ రాజుతో ఇప్పించారు. ఈ వీడియోతో ఎఫ్3 టీమ్ రేట్స్ పై సరైన క్లారిటీని పక్కాగా ఇచ్చేసారు. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫ్3కి వచ్చేస్తాయి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఈ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Cinema Ticket Rates : కరెంట్ రేట్ తగ్గిస్తే .. టిక్కెట్ల ధరలు తగ్గిస్తాం..!

మే 20న జీవిత డైరెక్షన్ లో రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను జీవిత టికెట్ రేటుకు సంబంధించి ప్రస్తావించారు. శేఖర్ సినిమా టిక్కెట్ల రేటును పెంచడం లేదనీ అందరికీ అందుబాటులో రేట్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా ఈమధ్య అన్ని సినిమాలకు టికెట్ రేట్ ఓవర్ గా పెంచడంతో థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను ఇప్పుడిలా వెతికి పట్టుకొచ్చే పనిలో పడ్డారు మేకర్స్.

Movie Tickets Issue: పవన్ తర్వాత ప్రకాష్ రాజ్.. ఇది దేనికి సంకేతం?

అందరికీ అందుబాటులో టికెట్ రేట్ ఉన్నప్పుడే థియేటర్లు నిండుతాయి. పదే పదే రిపీటెడ్ ఆడియెన్స్ తో సినిమా కళకళలాడుతుంది. బడ్జెట్ పెరిగిందన్న పేరుతో రేట్ పెంచుకుంటూ పోతుంటే.. హాళ్లకొచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా ఈమధ్య లో బడ్జెట్ సినిమాలకు సైతం రేట్ పెంచేస్తుంటే.. టాక్ బాగున్నా.. సినిమా హాల్ కి వచ్చి చూసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాకు జరిగిందిదే.

Movie Releases: షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదే!

శ్రీవిష్ణు భళా తందనానపై టికెట్ రేట్ ఎఫెక్ట్ పడింది. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటాడనే పేరున్న శ్రీవిష్ణు సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కొందరు ఆసక్తిని చూపించారు. తీరా సినిమా చూద్దామనుకున్న టైమ్ లో టికెట్ రేట్ షాకిచ్చింది. ఈ లో బడ్జెట్ సినిమాకు కూడా ఇంత రేట్ పెట్టాలా అంటూ చాలామందే సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. చివరికి భళా తందనానకు ఫలితం లేకుండా పోయింది.

Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్!

ఓ ఫ్యామిలీ.. నలుగురు కలిసి సినిమాకి రావాలంటే భయపడిపోతున్నారు. జేబు గుల్లా అయిపోతుందని బెంబేలెత్తుతున్నారు. పెద్ద హీరో కదా అని ఆశపడ్డ ఫ్యామిలీ ఆడియెన్స్ కు.. పెద్ద రేట్ అడ్డంకిగా మారుతోంది. మా సినిమా ఖర్చు ఇంత అని ప్రభుత్వాల ముందు చిట్టా ఓపెన్ చేయగానే.. ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులిస్తున్నాయి. దానికి తగ్గట్టు బాదుడు కూడా శ్రుతిమించుతోంది. టికెట్ రేట్ ఎంతున్నా.. ఫ్యాన్స్ ఆగరు.. కానీ అన్ని వర్గాల వారు థియేటర్ కి రావాలంటే అది సాధ్యపడదనే చర్చ నడుస్తోంది.

Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

భీమ్లా నాయక్, అఖండ, పుష్ప సినిమాలు టికెట్ రేట్ విషయంలో పెద్ద మార్పులు లేకుండానే బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. సినిమాలో మ్యాటర్ ఉంటే, కావాల్సినంత మాస్ అప్పీల్ ఉంటే ఆటోమేటిక్ జనం ఆదరిస్తారని కొన్ని సినిమాలిలా ప్రూవ్ చేస్తున్నాయి. సినిమా టాక్ కలెక్షన్లి నిర్ధారిస్తుంది కాబట్టి.. పూర్తి టాక్ బయటికి రాకముందే ఎంతో కొంత దండుకోవచ్చనే ఆలోచన కూడా కొందరి మేకర్స్ లో ఉండొచ్చు. అందుకే టికెట్స్ రేట్స్ విపరీతంగా పెంచేసి వీకెండ్ లో సినిమా రిలీజ్ చేసి.. ఫస్ట్ డే ఇన్ని కోట్లు.. సెకండ్ డే ఇన్ని కోట్లని లెక్కలేసుకుంటూ కొత్త రికార్డులను సర్క్యులేట్ చేస్తున్నారు.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

ఓ సినిమా రిలీజ్ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టినా.. లాంగ్ రన్ ఎందుకు కొనసాగించలేకపోతుంది. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితాన్ని ఎందుకు రాబట్టలేకపోతుంది అంటే ఇదివరకటిలా జనం థియేటర్స్ కి రాకపోవడమే. ముఖ్యంగా కుటుంబ సమేతంగా సినిమా చూడాలనుకుంటే ఈ కొవిడ్ క్రైసిస్ కాలంలో అదనపు భారంగా జనం భావిస్తున్నారు. ఫలితం ఏదైనా కానీ అది బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఈ విషయంలో గట్టెక్కుతున్నాయి.

Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

కరోనా పాండమిక్ కారణంగా గత రెండేళ్లలో సినీ సినారియో మారింది. థియేటర్స్ మూసేయడంతో ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే ప్రేక్షకులను ఓటీటీలు అట్రాక్ట్ చేశాయి. అప్పటివరకు బిగ్ స్క్రీన్ లోనే సీన్స్ ఎంజాయ్ చేయాలనుకున్న ఆడియెన్స్.. ఓటీటీ స్మాల్ స్క్రీన్ తోనూ సరదాగా గడిపేయడం అలవాటు చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే నెల రోజులు.. ఫ్లాప్ కొడితే వెంటనే ఓటీటీ కొచ్చేస్తుందిలే అన్న ధీమా జనాల్లో పెరిగింది. రాధేశ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు ఈ ఫార్ములానే ప్రూవ్ చేశాయి. అందుకే హై టికెట్ రేట్స్ ఉండగా.. డివైడ్ టాక్ వచ్చిన సినిమా వైపు చూసేందుకు కూడా ఆడియెన్ ఇష్టపడట్లేదు.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

పాన్ ఇండియా ప్రాజెక్ట్, రీజనల్ సినిమా అన్న తేడాలొచ్చాక ఆడియెన్స్ ఆలోచనల్లో కూడా మార్పొచ్చింది. పాన్ ఇండియా కంటెంట్ లేకుండా వెరీ రెగ్యులర్ సినిమాలయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయమై బాగా ఆలోచించారు. ఎఫ్3లో పెద్ద హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించినా కానీ టికెట్ రేట్ పెంచే ఛాన్స్ లేదని చెప్పేసారు. ఎఫ్3 పై గ్యారంటీ నమ్మకమున్న దిల్ రాజు రిపీట్ ఆడియెన్ ని థియేటర్లకు రప్పించడమే ధ్యేయంగా రెగ్యులర్ టికెట్ ధరలకే ప్రేక్షకులకు సినిమా చూపించబోతున్నారు.