Rajinikanth : మొన్న అమితాబ్, నేడు రజిని.. కోర్ట్‌లో పిటిషన్!

సినీ పరిశ్రమలోని స్టార్స్ అంతా వరుసపెట్టి కోర్ట్ ని ఆశ్రయిస్తున్నారు. మొన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నేడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఏమైంది? ఇంతటి బడా స్టార్స్ కోర్ట్ మెట్టులు ఎక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా?

Rajinikanth : మొన్న అమితాబ్, నేడు రజిని.. కోర్ట్‌లో పిటిషన్!

rajinikantha amitab bachchan

Rajinikanth : సినీ పరిశ్రమలోని స్టార్స్ అంతా వరుసపెట్టి కోర్ట్ ని ఆశ్రయిస్తున్నారు. మొన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నేడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఏమైంది? ఇంతటి బడా స్టార్స్ కోర్ట్ మెట్టులు ఎక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే.. పాపులారిటీ ఉన్న ఒక హీరో లేదా స్టార్ ఫోటో ఉపయోగించుకొని చాలా మంది వారి వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం మన చాలానే చూస్తాము. తమ అభిమాన ఫోటో చూసి కొంతమంది వాటిని నిజంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఫోటోలను కూడా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు.

Rajinikanth : హీరో కాకముందు మద్యం, సిగరెట్లకు బానిసని.. రజినీకాంత్!

ఇటీవల దీనిని సీరియస్ గా తీసుకున్న అమితాబ్ కోర్ట్ లో పిటిషన్ వేశాడు. తన పేరుని, ఫేమ్‌ని, ఫోటోని.. తన అనుమతి లేకుండా ఉపయోగించుకోడానికి వీలు లేదు. దాని వాళ్ళ తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది అంటూ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రజినీకాంత్ కూడా కోర్ట్ ని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా ఎవరు తన ఫోటోలను ఉపయోగించుకోకూడదు అంటూ పబ్లిక్ నోటికి విడుదల చేశాడు. బిసినెస్ పరంగా తన ఫేమ్‌ని, పేరుని వాడుకొనే హక్కు రజినీకి మాత్రమే ఉంది. ఇకపై ఆయన అనుమతి లేకుండా ఎవరు ఆయన ఫోటోలను ఉపయోగించుకోడానికి వీలు లేదు అంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు.

దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. కాగా రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సౌత్ లోని బడా స్టార్స్ అంతా నటిస్తున్నారు. కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ, సునీల్, జాకీ షరీఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.