Rajinikanth : హీరో కాకముందు మద్యం, సిగరెట్లకు బానిసని.. రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోకి రాకముందు బస్ కండక్టర్ గా పని చేసేవాడని అందరికి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను ఒక వ్యసనపరుడిని అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు.

Rajinikanth : హీరో కాకముందు మద్యం, సిగరెట్లకు బానిసని.. రజినీకాంత్!

rajinikanth

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన యూనిక్ స్టైల్ తో అన్ని భాషల వారికీ దగ్గరయ్యాడు. రజిని సినిమా వస్తుంది అంటే దేశవ్యాప్తంగా అది ఒక పెద్ద పండగల ఉంటుంది. కేవలం భారత్ లోనే కాదు జపాన్ లో కూడా రజినీకాంత్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. RRR రాకముందు వరకు జపాన్ లో దాదాపు 22 ఏళ్ళ పాటు కలెక్షన్స్ లో ఒక రికార్డు ని బెంచ్ మార్క్ గా సెట్ చేశాడు అంటే రజిని ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోండి. సినిమాల్లో ఇంతటి ఇమేజ్ ని సంపాదించుకున్న రజినీకాంత్.. సినిమాలోకి రాకముందు బస్ కండక్టర్ గా పని చేసేవాడు.

Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

అయితే ఆ సమయంలో తాను ఒక వ్యసనపరుడిని అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరయ్యిన రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘నేను కండక్టర్ గా పని చేసిన సమయంలో రోజు మద్యం తాగే వాడిని. ఇక సిగరెట్లు రోజులో ఎన్ని తాగేవాడినో నాకే తెలియదు. ఆ తరువాత సినిమాలోకి వచ్చాక పేరు, డబ్బు రావడంతో వాటికీ మరెంత బానిసని అయ్యిపోయాను. అయితే వాటి నుంచి నన్ను నా భార్య లత దూరం చేసింది. నన్ను చాలా వరకు మార్చింది. అందుకనే ఇప్పుడు 73 సంవత్సరాల వయసు వచ్చినా.. నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నాడు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో సౌత్ ఇండస్ట్రీలోని భారీ తారాగణం అంతా కనిపించబోతున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. నరసింహ తరువాత మళ్ళీ ఇప్పుడు రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది రమ్యకృష్ణ. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.