Rakhi Sawant : మొన్నే విడాకులు.. నేడు మంచి ఇల్లు, కారు ఉంటే మళ్ళీ రావొచ్చు అంటూ నటి ప్రకటన

తాజాగా మరోసారి రితీష్ తో విడాకులపై ఓ మీడియాతో రాఖి సావంత్ మాట్లాడుతూ... ''బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. రితేశ్‌కు ఇదివరకే పెళ్లైందని, ఒక బాబు.......

Rakhi Sawant : మొన్నే విడాకులు.. నేడు మంచి ఇల్లు, కారు ఉంటే మళ్ళీ రావొచ్చు అంటూ నటి ప్రకటన

Rakhi

Rakhi Sawant :  ఇటీవల సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపొయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ .. ఇలా అన్ని పరిశ్రమలలోను చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా మొన్న వ్యాలెంటైన్స్ డే రోజు బాలీవుడ్ నటి, డ్యాన్సర్ రాఖీ సావంత్ తన భర్త రితేష్‌ సింగ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక రితీష్ గురించి నాకు అనేక విషయాలు తెలిశాయని, కలిసి ఉండాలని ఎంత ట్రై చేసినా కుదరలేదని, అందుకే విడిపోతున్నట్లు పోస్ట్ పెట్టింది రాఖీ.

తాజాగా మరోసారి రితీష్ తో విడాకులపై ఓ మీడియాతో రాఖి సావంత్ మాట్లాడుతూ… ”బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. రితేశ్‌కు ఇదివరకే పెళ్లైందని, ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి నేను షాక్ అయ్యాను. రితీష్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు అని తెలిసింది. అలాంటప్పుడు మా వివాహం చట్టబద్ధంగా చెల్లదు. మేము ఈ ఏడాది పిల్లలను కూడా కనాలని ప్లాన్‌ చేసుకున్నాం. కానీ అంతలోనే నాకు ఇదంతా తెలిసి మంచి పని జరిగింది. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నేనే అతడిని ముద్దు పెట్టుకున్నాను, కానీ రితేశ్‌ మాత్రం కనీసం నన్ను అసలు తాకలేదు. మీడియా ముందు సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నాను కానీ ఇలాంటివాడనుకోలేదు.

Pooja Hegde : ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జంటగా పూజాహెగ్డే, నాగ చైతన్య ?

దీని మీద మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. నేను ఎంతగానో ప్రేమించిన అతడు నన్ను వదిలేయడానికే సిద్ధపడ్డాడు. నన్ను ఒంటరిగా వదిలేయొద్దని అతడి కాళ్లు పట్టుకుని బతిమాలినా వినిపించుకోకుండా నా జీవితంలో నుంచి వెళ్లిపోయాడు. ఒకవేళ అతడు నాతో మళ్లీ కలిసి ఉండాలనుకుంటే మాత్రం మంచి ఇల్లు, కారు కొన్న తర్వాతే తను నా దగ్గరకు రావాలి’ అని కండీషన్‌ పెట్టింది రాఖీ సావంత్‌.

Rakhi Sawant : వ్యాలెంటైన్స్ డే రోజే విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్

దీంతో రాఖీ సావంత్ పెట్టిన ఈ కండిషన్ చూసి ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అయ్యారు. విడాకులు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ విడాకులు ఇచ్చి ఇలా ఇల్లు, కారు ఉంటే కలుస్తామనడమేంటి? డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నావా? అంటూ నెటిజన్లు రాఖీని ట్రోల్ చేస్తున్నారు.