Pooja Hegde : ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జంటగా పూజాహెగ్డే, నాగ చైతన్య ?

ప్రస్తుతం నాగ చైతన్య 'థ్యాంక్ యూ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఆ సినిమా తెలుగు, తమిళ్..........

Pooja Hegde :  ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జంటగా పూజాహెగ్డే, నాగ చైతన్య ?

Naga Chaitanya

Naga Chaitanya :  ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజ హెగ్డే. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళ్ , హిందీ సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజ చేతిలో దాదాపు ఆరు సినిమాలున్నట్టు సమాచారం. తాజాగా మరో సినిమాకి ఓకే చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో పూజా హెగ్డే మొదటి సినిమా నాగ చైతన్య సరసన ‘ఒక లైలా కోసం’లో నటించింది. నాగ చైతన్య కూడా ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం నాగ చైతన్య ‘థ్యాంక్ యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఆ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. దీనికి కథానాయికగా పూజా హెగ్డేని అనుకుంటున్నట్టు సమాచారం.

Pawan Kalyan : రాబోయే సినిమాల డైరెక్టర్స్ తో పవన్ పిక్.. వైరల్ అవుతున్న ఫోటో..

ప్రస్తుతం నాగ చైతన్య ‘థ్యాంక్ యూ’ సినిమా షూటింగ్ కోసం రష్యాలో ఉన్నారు. త్వరలోనే ఇండియాకి రానున్నారు. నాగ చైతన్య ఇండియా వచ్చాక డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే వెంకట్ ప్రభు పూజాకి కథ చెప్పారని తెలుస్తుంది. మరి పూజా హెగ్డే మరోసారి తన మొదటి హీరో నాగ చైతన్యతో జోడి కడుతుందా చూడాలి..