Pawan Kalyan : రాబోయే సినిమాల డైరెక్టర్స్ తో పవన్ పిక్.. వైరల్ అవుతున్న ఫోటో..
“భీమ్లా నాయక్” సెట్స్‌లో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాల డైరెక్టర్స్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'భీమ్లా నాయక్' సెట్స్ లో పవన్ ని కలిశారు. హరీష్ శంకర్, క్రిష్....

New Project
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రానా తో కలిసి చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ పాట షూట్ చేశారు. ఈ పాట చివరి రోజూ షూటింగ్ నిన్న జరిగింది. దీంతో ఈ షూట్ గ్యాప్ లో “భీమ్లా నాయక్” సెట్స్‌లో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాల డైరెక్టర్స్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ అనే హిస్టారికల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూట్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సినిమా. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
Pawan kalyan : ‘భీమ్లా నాయక్’ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గెటప్ లీక్.. వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్
తాజాగా ఈ ఇద్దరు డైరెక్టర్స్ ‘భీమ్లా నాయక్’ సెట్స్ లో పవన్ ని కలిశారు. హరీష్ శంకర్, క్రిష్ కలిసి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారు. ఈ ఫోటోని భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర తీశారు. క్రిష్ ఈ ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు. వచ్చే పవన్ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
'భవదీయుడు' 'హరి హర'
భీమ్లా నాయక్!@harish2you pic.twitter.com/UdOfwwIy6r
— Krish Jagarlamudi (@DirKrish) February 16, 2022