Rakul Preet Singh : వెబ్ సిరీస్‌లు చేస్తాను.. కానీ.. రకుల్ కండిషన్స్

ఇటీవల అందరు హీరోయిన్లు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, శృతిహాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సెరిస్ లు చేస్తున్నారు. తాజాగా..

Rakul Preet Singh : వెబ్ సిరీస్‌లు చేస్తాను.. కానీ.. రకుల్ కండిషన్స్

Web Series

Rakul Preet Singh :   ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని అలరించిన రకుల్ ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ఈ సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన 7 సినిమాలు రిలీజ్ అవ్వబోతుండగా అందులో ఆరు సినిమాలు బాలీవుడ్ నుంచే కావడం విశేషం. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తన ప్రియుడు జాకీ భగ్నానీతో ప్రేమని ఎంజాయ్ చేస్తుంది.

ఇటీవల అందరు హీరోయిన్లు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, శృతిహాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సెరిస్ లు చేస్తున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లు చేస్తానంటుంది కానీ కండిషన్లు పెడుతుంది. ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ లు చేస్తారా అని అడగడంతో రకుల్ తన మనసులోని మాట బయట పెట్టింది.

Dimple Hayathi : ఆడిషన్స్‌కి వెళ్తే నల్లగా ఉన్నానన్నారు

ఈ విషయంపై రకుల్‌ మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాల రిలీజ్‌లు, ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే ఉండేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా వ్యూయర్స్‌ చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పాన్‌ ఇండియన్‌ మూవీ బిజినెస్‌ విషయంలో ‘బాహుబలి’ కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులూ చెరిగిపోయాయి. మంచి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్‌ చేయడంతో పాటు నా పాత్ర కథను నడిపించేలా ఉండాలి. కథ మొత్తం నా చుట్టే తిరగాలి’’ అని తెలిపింది. రకుల్ చుట్టే కథ తిరిగేలా రకుల్ ని మెయిన్ లీడ్ గా చూపిస్తూ ఆమెతో వెబ్ సిరీస్ ఎవరు తీస్తారో చూడాలి మరి.