Ram Charan : హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు గురించి రామ్‌చరణ్ కామెంట్స్.. అమెరికన్ యాంకర్ ప్రశంసలు!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు.

Ram Charan : హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు గురించి రామ్‌చరణ్ కామెంట్స్.. అమెరికన్ యాంకర్ ప్రశంసలు!

ram charan about his hollywood projects

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధికమంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో అమెరికన్ నెంబర్ వన్ న్యూస్ స్ట్రీమింగ్ ఛానల్ ABC న్యూస్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు.

Ram Charan : ఇంటర్వ్యూ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌ ఫాలో అయ్యేవాళ్లని కూడా ఫాలో కొట్టిన అమెరికన్ ఫేమస్ డాక్టర్..

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇండియన్ సినిమాల్లో నటిచాలి అనుకుంటున్నారా? లేదా హాలీవుడ్ సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు చరణ్ బదులిస్తూ.. ‘ప్రస్తుతం నేను ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాను. అలాగే అవుట్ సైడ్ ఇండియా కూడా ప్రాజెక్ట్ లు కూడా చేయాలనీ అనుకుంటున్నా. ఇక్కడి డైరెక్టర్ లతో కూడా వర్క్ ఎక్స్‌పిరెన్స్ చేయాలనీ ఉంది. ఒకవేళ అవకాశం వస్తే కచ్చితంగా ఇక్కడ కూడా సినిమాలు చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు.

దీనికి అమెరికన్ యాంకర్ ‘హాలీవుడ్ సినిమాల్లో మీకు అవకాశం వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు’ అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నేడు (ఫిబ్రవరి 24) బెవర్లీ హిల్స్ లో జరగబోయే HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ కి రామ్ చరణ్ ప్రజెంటర్ గా హాజరు కాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం.