Ram Charan : ఇంటర్వ్యూ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌ ఫాలో అయ్యేవాళ్లని కూడా ఫాలో కొట్టిన అమెరికన్ ఫేమస్ డాక్టర్..

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక తన నటనతో పాటు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో చరణ్ ని ఫాలో కొడుతూ వస్తున్నారు.

Ram Charan : ఇంటర్వ్యూ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌ ఫాలో అయ్యేవాళ్లని కూడా ఫాలో కొట్టిన అమెరికన్ ఫేమస్ డాక్టర్..

Jennifer Ashton ram charan

Updated On : February 23, 2023 / 4:36 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రోజురోజుకి తన పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక తన నటనతో పాటు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో చరణ్ ని ఫాలో కొడుతూ వస్తున్నారు. దీంతో RRR తరువాత రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ లిస్ట్ 3 మిలియన్స్ పెరిగింది.

Ram Charan : చరణ్ స్టైల్ పై అమెరికన్ యాంకర్ కామెంట్స్.. వినయంగా నటించడానికి ట్రై చేస్తున్నా అంటున్న చరణ్..

ఇక ఇటీవల ఆస్కార్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రామ్ చరణ్.. అమెరికన్ పాపులర్ టాక్ షోలో ఒకటైన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’కు గెస్ట్ గా వెళ్ళాడు. ఇక ఈ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ కూడా పాల్గొంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ పూర్తీ అవ్వగానే జెన్నిఫర్.. ఇన్‌స్టాగ్రామ్ లో రామ్ చరణ్ ని ఫాలో కొట్టింది. అంతేకాదు చరణ్ తో పాటు తను ఫాలో అయ్యేవాళ్లని కూడా ఫాలో కొట్టడడం విశేషం.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి, ఉపాసన, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, నిహారిక, శ్రీజ అండ్ సుస్మిత కొణిదల, సాయి ధరమ్ తేజ్, రానా, శర్వానంద్, రాజమౌళి, సుకుమార్, కియారా, అలియా, కత్రినా కైఫ్, పి వి సింధు లను ఫాలో కొట్టింది. ఇక ఈ విషయాన్ని చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో డాక్టర్ జెన్నిఫర్.. తండ్రి కాబోతున్న రామ్ చరణ్ కి కృతజ్ఞతలు తెలుపగా, ఆ బేబీని డెలివరీ చేసే అవకాశం నాకు వస్తే గౌరవంగా భావిస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.