Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..

కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న మెగా పవర్ స్టార్ ఇప్పుడు వెయ్యి కోట్ల హీరోగా మారారు..

Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..

Ram Charan

Ram Charan: ఒకప్పుడు హీరోగా సెటిల్ అవుతాడా అనుకున్న రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో అయ్యారు. హీరో అంటే ఏదో అల్లా టప్పా హీరో కాదు.. అక్షరాలా వెయ్యి కోట్ల హీరో. ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల బడ్జెట్, మార్కెట్ ఉన్న హీరోగా కొత్త అవతారం ఎత్తారు రామ్ చరణ్. మరి చరణ్ చేతిలోఉన్న ఆ వెయ్యి కోట్ల సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Pawan Kalyan – Anushka : ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ అంట..!

కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న ఈ మెగా పవర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల హీరో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల బడ్జెట్ హీరో రికార్డ్ రామ్ చరణ్‌దే. చరణ్ ప్రజెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ చేతిలో ఉన్న సినిమాల వాల్యూ వెయ్యి కోట్లు. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా అక్షరాలా 500 కోట్లతో తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో కనిపించబోతున్న రామ్ చరణ్ లుక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Ram Charan : మన్యం వీరుడిగా మెగా పవర్‌స్టార్.. లుక్ అదిరిందిగా!..

‘ట్రిపుల్ ఆర్’ లో అల్లూరిగా కనిపిస్తున్న చరణ్.. కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి మెయిన్ లీడ్ రోల్‌లో చేస్తున్న సినిమా ‘ఆచార్య’ లో మరో ఇంట్రెస్టింగ్ లీడ్ రోల్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్లతో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో సిద్ధ క్యారెక్టర్‌లో నక్సలైట్‌గా కనిపించబోతున్నారు చరణ్.

Ram Charan New Look : ఆచార్య ‘సిద్ధ’ న్యూ లుక్ అదిరిందిగా..!

‘ట్రిపుల్ ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో పాటు లేటెస్ట్‌గా మరో సినిమాని స్టార్ట్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. ఈ బుధవారం రణవీర్ సింగ్ గెస్ట్‌‌గా అఫీషియల్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమాని దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరెక్కిస్తున్నారు దిల్ రాజు. ఈ వెయ్యి కోట్ల బడ్జెట్ హీరో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఫ్యాన్స్.