Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!

రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత అందరికి గుర్తిండిపోయారు. తాజాగా చరణ్ సమంతకి ట్వీట్ చేశాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ..

Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!

Ram Charan tweet on Samantha birthday and Citadel

Ram Charan – Samantha : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమాలో చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత అందరి మనసులు దోచుకున్నారు. వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే, సమంత పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. సిటాడెల్ (Citadel) అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Dil Raju : నా 25 ఏళ్ళ కెరీర్‌లో సమంత.. పెద్ద షాక్ ఇచ్చింది.. దిల్ రాజు!

కాగా నేడు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు కావడంతో ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. “డియర్ సమంత నీ వర్క్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీకు మంచి ఆరోగ్యం, విజయాలు కలగాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే అండ్ సిటాడెల్ కి గుడ్ లుక్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. సమంత దీనికి ఏమని రిప్లై ఇస్తుందా? అని చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Ram Charan : ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడా??

ఇక సమంత నటిస్తున్న సిటాడెల్.. అమెరికన్ అండ్ ఇండియన్ వెర్షన్ లో తెరకెక్కుతుంది. అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా (‎Priyanka Chopra) సమంత పాత్ర చేస్తుంది. ఇటీవల అమెరికన్ సిటాడెల్ టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఆ టీజర్ లో ప్రియాంక చోప్రా స్టంట్స్ చూసి సమంత ఏ రేంజ్ లో చేసిందో అని ఎదురు చూస్తున్నారు. గతంలో సమంతతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ – డికే డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ చేస్తున్నాడు.