Ram Charan : ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడా??
చరణ్ భార్య ఉపాసన ఇటీవలే ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో తల్లి కాబోతుందని కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు పార్టీలో బేబీ బంప్ తో కూడా కనపడి అలరించింది ఉపాసన.

Ram Charan wants to give a break to shootings till the delivery of Upasana
Ram Charan : రామ్ చరణ్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది చరణ్ కు. RRR తర్వాత ఇప్పటివరకు రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయినా కూడా ఆందులో శంకర్(Shankar) సినిమా ఒక్కటే మెల్లిగా షూట్ చేస్తున్నారు. శంకర్ అటు కమల్ హాసన్(Kamal Haasan) ఇండియన్ 2(Indian 2) సినిమా కూడా ఒకేసారి చేస్తుండటంతో చరణ్ సినిమా స్లోగా సాగుతుంది. శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన(Buchhibabu Sana) సినిమా ఉంది.
ఇక చరణ్ భార్య ఉపాసన ఇటీవలే ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో తల్లి కాబోతుందని కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు పార్టీలో బేబీ బంప్ తో కూడా కనపడి అలరించింది ఉపాసన. పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని చెప్పిన దగర్నుంచి చరణ్ షూటింగ్ లేకపోతే ఉపాసనతోనే టైం గడుపుతున్నాడు. ఉపాసనతో కలిసి ట్రిప్స్ వేస్తున్నాడు.
RK Selvamani : తమిళ చిత్రాలు తమిళనాడులోనే షూటింగ్ జరగాలి.. రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు..
తాజాగా చరణ్ గురించి ఓ వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. త్వరలో చరణ్ – శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ షూట్ ఉండబోతుంది. ఆ షెడ్యూల్ అయిన తర్వాత ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడని సమాచారం. మొదటిసారి ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో, డెలివరీ టైంలో ఉపాసన దగ్గరే ఉండాలని, ఉపాసనకు టైం ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడని, అందుకే ప్రస్తుతం ఓకే చేసిన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసి ఉపాసన డెలివరీ అయ్యేవరకు తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇస్తాడని అంటున్నారు. ఉపాసన డెలివరీ అయ్యాకే మళ్ళీ చరణ్ షూటింగ్స్ లో పాల్గొంటాడని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా మెగా సన్నిహితుల్లో ఈ టాక్ వినిపిస్తుంది.