RK Selvamani : తమిళ చిత్రాలు తమిళనాడులోనే షూటింగ్ జరగాలి.. రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు..

ఇటీవల సౌత్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. సినిమాలని మరింత గొప్పగా నిర్మిస్తున్నారు. విదేశాల్లో కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకొని మరీ షూటింగ్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

RK Selvamani : తమిళ చిత్రాలు తమిళనాడులోనే షూటింగ్ జరగాలి.. రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు..

RK Selvamani comments on Tamil Movies in CII Dakshin Summit

RK Selvamani :  తాజాగా CII (కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్ చెన్నై(Chennai)లో ఘనంగా జరుగుతుంది. మరో రెండు రోజులు ఈ సదస్సు సాగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశాన్ని వివిధ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి CII దక్షిణ్ సమ్మిట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమం మొదటి రోజు సుహాసిని, అల్లు అరవింద్, RK సెల్వమణి, ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్, కార్తీ, రిషబ్ శెట్టి, మంజు వారియర్, వెట్రిమారన్.. ఇలా అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. ఈ ఈవెంట్ లో రోజా భర్త RK సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సౌత్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. సినిమాలని మరింత గొప్పగా నిర్మిస్తున్నారు. విదేశాల్లో కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకొని మరీ షూటింగ్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ విషయంపై RK సెల్వమణి మాట్లాడుతూ.. ఇప్పటివరకు సౌత్ లో దాదాపు 50 వేలకు పైగా సినిమాలు తెరకెక్కాయి. ఇటీవల మన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. కానీ తమిళ సినిమాలు తమిళ నాడులో కాకుండా వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే మొత్తం తమిళనాడు బయటే షూట్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి కార్మికులు నష్టపోతున్నారు. తమిళ సినిమాల షూటింగ్స్ తమిళనాడులోనే అధికంగా జరిగేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు ప్రభుత్వం సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని వ్యాఖ్యానించారు.

Manchu Manoj – Bhuma Mounika : పెళ్లి కాకముందు మౌనికని మోహన్ బాబు అలా ట్రీట్ చేసేవారు.. ఇప్పుడు!

దీనిపై నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి, తదితరులు సినీ పరిశ్రమ గురించి అడిగిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాను అని అన్నారు. ఇక ఈ సమ్మిట్ లో ఇటీవల ఆస్కార్ సాధించిన RRR టీం నుండి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని, ది ఎలిఫెంట్‌ ఆఫ్‌ విస్పరర్స్‌ సినిమా డైరెక్టర్ కార్తీకిని సన్మానించారు.