Ramarao On Duty: రంజాన్ రోజున రామారావు క్లారిటీ..!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రామారావు ఆన్ బ్యూటీ కూడా ఒకటి. ఈ సినిమాను పూర్తిగా సోషల్ మెసేజ్‌తో కూడుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా...

Ramarao On Duty: రంజాన్ రోజున రామారావు క్లారిటీ..!

Ramarao On Duty Second Single Song Release Date Locked

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రామారావు ఆన్ బ్యూటీ కూడా ఒకటి. ఈ సినిమాను పూర్తిగా సోషల్ మెసేజ్‌తో కూడుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు శరత్ మాండవ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మాస్ రాజా పవర్‌ఫుల్ గవర్నమెంట్ అధికారి పాత్రలో చెలరేగిపోయి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా రంజాన్ వేడుకను పురస్కరించుకుని, రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ చేసింది.

Ramarao on Duty: ఫీల్ గుడ్ మెలోడీగా ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ రిలీజ్!

ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్ ‘‘సొట్టబుగ్గల్లో’ అనే పాటను మే 7న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. సామ్.సిఎస్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా, ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంషా కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ పాట రొమాంటిక్‌గా ఉండటమే కాకుండా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దున్నారు చిత్ర యూనిట్.

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

జూన్ 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రటకించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మాస్ రాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ మూవీలో వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.