Unstoppable with NBK : భళ్లాలదేవతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

తాజాగా రాబోయే ఎనిమిదవ ఎపిసోడ్ కి రానా దగ్గుబాటి రాబోతున్నారు. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో రానాతో హల్ చల్ చేసిన బాలయ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.......

Unstoppable with NBK : భళ్లాలదేవతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

Unstoppable With Nbk

Unstoppable with NBK :  గత కొద్ది రోజుల నుంచి బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయం సాధించారు. మరో పక్క ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోతో జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ షోలో బాలయ్య బాబు తన కామెడీ టైమింగ్ తో, తన మార్క్ యాంకరింగ్ తో అందర్నీ మెప్పిస్తున్నారు. వచ్చిన సెలబ్రిటీలని ఓ ఆట ఆడుకుంటూ ప్రేక్షకులకి ఆనందాన్ని పంచుతున్నారు.

ఇప్పటికే ఈ షోకి మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాని, రాజమౌళి, కీరవాణి, సుకుమార్, అల్లుఅర్జున్, రష్మిక, రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చారు. తాజాగా రాబోయే ఎనిమిదవ ఎపిసోడ్ కి రానా దగ్గుబాటి రాబోతున్నారు. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో రానాతో హల్ చల్ చేసిన బాలయ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో భళ్లాలదేవతో కూడా గట్టిగానే ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్ జనవరి 7న ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Krithi Shetty : మళ్ళీ రొమాన్స్‌తో రెచ్చిపోనున్న బేబమ్మ

ఇక ఈ సీజన్ లాస్ట్ 10వ ఎపిసోడ్ గా మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. ఇప్పటికే ఇది షూట్ కూడా కంప్లీట్ అయింది. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక తొమ్మిదవ ఎపిసోడ్ లో గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మొత్తానికి బాలయ్య తన హోస్టింగ్ తో షోని బాగా నడిపిస్తున్నారు అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.