Dhamaka : మరోసారి రవితేజ డ్యూయల్ రోల్.. ఈ సారన్నా వర్కౌట్ అవుతుందా??

రవితేజ తన కెరీర్ లో ‘ఓ పనైపోతుంది బాబూ, విక్రమార్కుడు, కిక్ 2, దరువు’ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. వీటిలో ఒక్క ‘విక్రమార్కుడు’ మూవీనే అతడి కెరీర్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఫ్లాప్ అయినా వాటిలో...........

Dhamaka : మరోసారి రవితేజ డ్యూయల్ రోల్.. ఈ సారన్నా వర్కౌట్ అవుతుందా??

raviteja duel role in Dhamaka movie

Dhamaka :  ధమాకా మూవీతో మళ్ళీ డ్యూయల్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది రవితేజకు. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో అతడివ్వబోయే ధమాకా ట్రీట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కివ్వబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ’ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. మూడో సినిమా ‘ధమాకా’తో ఈ ఏడాదిని సక్సెస్ ఫుల్ గా ఎండ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఈ నెల 23న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది ధమాకా మూవీ.

ఈ క్రమంలో ఎన్నడూ లేనంతగా వరుస ప్రమోషన్స్ తో రిలీజ్ కు ముందే సినిమాను జనంలోకి తీసుకెళ్ళే ప్లాన్ తో దూసుకెళుతున్నాడు రవితేజ. ఇందులో రవితేజ మరోసారి డ్యూయల్ రోల్స్ తో డబుల్ కిక్కివ్వబోతున్నాడని ట్రైలర్ తోనే అర్ధమైంది. నిజానికి రవితేజకు ఆ ఫార్మేట్ లో మంచి పట్టుంది. గతంలో రవితేజ నాలుగు సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేశాడు. కాకపోతే వాటిలో ఒక్కటే బ్లాక్ బస్టరైంది.

రవితేజ తన కెరీర్ లో ‘ఓ పనైపోతుంది బాబూ, విక్రమార్కుడు, కిక్ 2, దరువు’ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. వీటిలో ఒక్క ‘విక్రమార్కుడు’ మూవీనే అతడి కెరీర్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఫ్లాప్ అయినా వాటిలో ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి ఢోకా ఉండదు. ఆ తర్వాత రవితేజ మళ్ళీ డ్యూయల్ రోల్స్ చేయడం ‘ధమాకా’ మూవీలోనే. ఇందులో రాజు పేద తరహాలో ఒకరి ప్లేస్ లోకి ఒకరు వెళ్ళి ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

Vishal : పవన్ అంటే అభిమానం.. జగన్ అంటే ప్రేమ.. విశాల్!

కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మంచి ఎక్స్‌పర్ట్ . కామెడీ టైమింగ్ లో తిరుగులేని టాలెంట్ రవితేజది. ఈ ఇద్దరూ కలిసిన ధమాకా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించొచ్చు. ట్రైలర్ రిలీజయ్యాకా ఈ మూవీపై మరింతగా హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలోని రవితేజ రెండు పాత్రలు హిలేరియస్ కామెడీని పండించబోతున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈసినిమా, మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్న రవితేజకి ఈ సారైనా కలిసొచ్చి హిట్ ఇస్తుందేమో చూడాలి.