Vishal : పవన్ అంటే అభిమానం.. జగన్ అంటే ప్రేమ.. విశాల్!

ఒక తెలుగు వాడైనా, తమిళ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు 'విశాల్'. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ హీరో పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తుంది. తాజాగా ఈ హీరో...

Vishal : పవన్ అంటే అభిమానం.. జగన్ అంటే ప్రేమ.. విశాల్!

Vishal about pawan kalyan and jagan mohan reddy

Vishal : ఒక తెలుగు వాడైనా, తమిళ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు ‘విశాల్’. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ హీరో నుంచి వస్తున్న సినిమా ‘లాఠీ’. పోలీస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చిన విశాల్.. నిన్న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాడు.

Vishal : చంద్రబాబుతో పోటీపై మరోసారి స్పందించిన హీరో విశాల్..

కాగా గత కొంతకాలంగా ఈ హీరో పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి పోటీగా వైఎస్‌ఆర్‌సిపి పార్టీ తరుపు నుంచి విశాల్ పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను కుప్పం నుంచి పోటీ చేయడం లేదని, ఆ వార్తలు అన్ని అవాస్తవం అని కొట్టి పడేశాడు విశాల్.

అయితే వ్యక్తిగతంగా తనకి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అంటూ ‘ఐ లవ్ జగన్’ అంటున్నాడు. “ఆయన ఎన్నికల్లో గెలిచిన తరువాత కలిసి అభినందనలు తెలుపుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు అపాయింట్‌మెంట్ దొరికితే, రేపు వెళ్లి కలుస్తాను” అని తెలియజేశాడు. అలాగే నటుడిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, ఆయనకి ఒక యూనిక్ స్టైల్ ఉంటది అది నాకు ఇష్టమంటూ తెలియజేశాడు. ఒకవేళ ఓటు వెయ్యాల్సి వస్తే ఎవరకి వేస్తారు అని అడిగిన ప్రశ్నకి.. కచ్చితంగా జగన్ కే వేస్తాను అని కుండ బద్దలుకొట్టేశాడు.