Dhamaka: ఎనర్జీకి తగ్గ టైటిల్ ధమాకా.. డ్యూయెల్ రోల్ మరో బోనస్!

ఆ మధ్య డిజాస్టర్ సినిమాలతో ఇబ్బందిపడిన రవితేజ క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి ఎక్కి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ..

Dhamaka: ఎనర్జీకి తగ్గ టైటిల్ ధమాకా.. డ్యూయెల్ రోల్ మరో బోనస్!

Dhamaka

Dhamaka: ఆ మధ్య డిజాస్టర్ సినిమాలతో ఇబ్బందిపడిన రవితేజ క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి ఎక్కి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. క్రాక్ సినిమాతో మొదలైన రవితేజ హవా వరస సినిమాలతో ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్ధమైంది. ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు.

AnthaIshtam: అంత ఇష్టం ఏందయ్యా నీకు.. భీమ్లా నుండి ఫీల్ గుడ్ మెలోడీ!

ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా ముమ్మర షూటింగ్ లో ఉంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకముందే మరో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రవితేజ ఇప్పుడు ఆ సినిమా నుండి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. రవితేజకి తగ్గ ఎనర్జిటిక్ టైటిల్ ధమాకా అని ఫిక్స్ చేయగా పోస్టర్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి విడుదల చేశారు.

Annaatthe: టైటిల్ కన్ఫర్మ్.. ‘పెద్దన్న’గా తలైవర్!

రవితేజ ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు డ్యూయల్ రోల్స్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. మొదటగా ఖిలాడి సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుండగా ఇప్పుడు టేకప్ చేస్తున్న త్రినాథరావు సినిమా కూడా డ్యూయల్ రోల్ లోనే ఉంటుందని అర్ధమవుతుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు భీమ్స్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు అలాగే అభిషేక్ అగర్వాల్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.