Mega 154 : మెగా మాస్ కాంబో.. ఈసారి థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

తాజాగా రవితేజ చిరంజీవితో కలిసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ కారు దిగి నడుచుకుంటూ...........

Mega 154 : మెగా మాస్ కాంబో.. ఈసారి థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

Chiranjeevi

Mega Mass :  ఈ ఏజ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఒకేసారి గాడ్‌ఫాదర్‌, భోళా శంకర్‌, మెగా 154 సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చిరంజీవికి బాగా కలిసొచ్చిన ఫుల్ మాస్ సినిమాగా ఇది రానుంది. ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. తాజాగా రవితేజ చిరంజీవితో కలిసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు.

Raviteja (1)

 

ఈ వీడియోలో రవితేజ కారు దిగి నడుచుకుంటూ చిరంజీవి క్యారవాన్‌ దగ్గరకు వెళ్లాడు. ‘అన్నయ్యా..’అంటూ తలుపు కొట్టగా.. ‘హాయ్‌ బ్రదర్‌’అంటూ చిరంజీవి ఫేస్ కనిపించకుండా కేవలం చెయ్యి అందించారు. రవితేజ ఎప్పటిలాగానే తన స్టైల్ తో కెమెరా వైపు చూసి కన్ను కొట్టి లోపలికి వెళ్ళాడు. వీరిద్దరు లోపలికి వెళ్లగానే డైరెక్టర్ బాబీ వచ్చి ‘మెగా మాస్‌ కాంబో మొదలైంది’ అని చెప్పడంతో వీడియో ముగిసింది. ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ రవితేజకి సంబంధించి మాస్ తో పెట్టుకుంటే అనే మాస్ బీట్, చిరుకి సంబంధించి శంకర్ దాదా బీట్ యాడ్ చేయడంతో ఈ వీడియో సూపర్ గా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

Raviteja : క్లాస్, మాస్.. ధర్మం కోసం నిలబడే రామారావు.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ మాస్ ర్యాంపేజ్..

రవితేజ స్టార్ కాకముందు చిరంజీవి, రవితేజలు కలిసి అన్నయ్య చిత్రంలో నటించారు. ఇప్పుడు ఇద్దరు స్టార్స్, ఇద్దరూ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పైకి ఎదిగిన వాళ్ళు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఒకవైపు మెగాస్టార్‌, మరోవైపు మాస్‌ మహారాజా.. ఇద్దరు కలిసి కనిపిస్తే థియేటర్స్‌ దద్దరిల్లిపోవడం ఖాయం. మెగా ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.