Realme Narzo N55 Launch : ఏప్రిల్ 12న రియల్‌మి Narzo N55 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme Narzo N55 launch : రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 12న రియల్‌మి నార్జో N55 ఫోన్ లాంచ్ కానుంది. ఏయే ఫీచర్లు ఉండనున్నాయి? ధర ఎంత ఉండొచ్చు అనేది కంపెనీ రివీల్ చేయలేదు.

Realme Narzo N55 Launch : ఏప్రిల్ 12న రియల్‌మి Narzo N55 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme Narzo N55 India launch April 12 (Photo Credit : Realme)

Realme Narzo N55 Launch: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మరికొద్ది రోజుల వరకు ఆగాల్సిందే.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త N55 సిరీస్ (Realme Narzo N55) ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 12న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే కంపెనీ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ ద్వారా లాంచ్ తేదీని ధృవీకరించింది.

రియల్‌మి నార్జో లైనప్‌లో మొదటి N సిరీస్ ఫోన్.. ఇప్పటివరకు, ఈ బ్రాండ్ రియల్‌మి Narzo 30, Narzo 50 వంటి మరిన్ని నంబర్ సిరీస్‌లను లాంచ్ చేసింది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుందని వెల్లడించింది. కంపెనీ అన్ని పాత నార్జో ఫోన్‌లతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, మిడ్-రేంజ్ చిప్‌తో సరసమైన ఫోన్‌ను అందించిన మొదటి బ్రాండ్‌గా రియల్‌మి అవతరించింది.

Read Also : Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

రియల్‌మి (Narzo N55) లాంచ్‌తో.. కొన్ని అధునాతన టెక్నాలజీ ఫీచర్లతో పర్ఫార్మెన్స్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. రాబోయే ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ బ్రాండ్ నార్జో సిరీస్ యూజర్ల నుంచి హైరెస్పాన్స్ పొందింది. భారత మార్కెట్లో 12.3 మిలియన్ల యూజర్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది.

Realme Narzo N55 India launch set for April 12, company promises to offer cutting-edge features

Realme Narzo N55 launch April 12 (Photo Credit : Realme)

రియల్‌మి లాంచ్ చేసిన చివరి నార్జో ఫోన్ 2022 మధ్యలో Narzo 50 సిరీస్.. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999గా ఉంది. రాబోయే రియల్‌మి Narzo N55 వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుందని లీక్‌లు డేటా సూచిస్తోంది. N55 మోడల్ బ్లాక్, బ్లూ, కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో అందించనుంది. అన్ని ధరల సెక్షన్లలో ప్రస్తుత (Realme Narzo N55) ఫోన్ భిన్నంగా ఉండకపోవచ్చు.

వచ్చే వారం.. ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. రియల్‌మి నుంచి రాబోయే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను లాంచ్‌కు ముందే రివీల్ చేయనుందని అంచనా. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి టీజర్ రిలీజ్ కాగా.. రాబోయే Narzo N55 ఫోన్ అమెజాన్ (Amazon Sale) ద్వారా సేల్ ప్రారంభించనుంది.

Tecno సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను ఏప్రిల్ 11న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. (Vivo) లేటెస్ట్ T2 స్మార్ట్‌ఫోన్ అదే రోజున దేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. (Asus ROG) ఫోన్ 7 ప్రో కూడా ఏప్రిల్ 13న లాంచ్ కానుంది. ఈ ఫోన్ గేమర్‌లను లక్ష్యంగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వారమే బడ్జెట్ Poco C51 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ. 10వేల లోపు బేసిక్ ఫోన్‌తో రానుంది.

Read Also : Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు కొత్త మడతబెట్టే ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!