Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno Phantom V Fold : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్నో ఫాంటమ్ V ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. భారీ 7.65-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 9000+ SoC, 5,000mAh బ్యాటరీతో రానుంది.

Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Tecno Phantom V Fold set to launch in India soon, price to be set under Rs 80,000

Tecno Phantom V Fold : భారత మార్కెట్లోకి కొత్త పోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. రూ. 80వేల లోపు ధరలో టెక్నో ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. ఇతర పోటీదారులైన ఒప్పో (Oppo), శాంసంగ్ (Samsung) తర్వాత, (Tecno) ఫాంటమ్ V ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (Mobile World Congress) సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించారు.

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ భారత్‌కు ఎప్పుడైనా రావొచ్చునని కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 2023లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ పెద్ద 7.65-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 9000+ SoC, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

లాంచ్ తేదీకి సంబంధించి ఏప్రిల్ 11న భారత మార్కెట్లో V ఫోల్డ్ లాంచ్ అవుతుందని Tecno ధృవీకరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.77,777 లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ముఖ్యంగా, 12GB, 256GB వేరియంట్‌లకు ఫోన్ ధర రూ. 89,999 కాగా, 12GB, 512GB వేరియంట్‌ల ధర రూ.99,999 అని కంపెనీ ముందుగా ప్రకటించింది.

Read Also :  Best Upcoming Smartphones : ఏప్రిల్ 2023లో రాబోయే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే మోడల్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ఏప్రిల్ 12 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో ఎర్లీ బర్డ్ ఆఫర్‌ (Early Bird Offer)గా అందుబాటులోకి రానుంది. Tecno కంపెనీ నోయిడా ఫ్యాక్టరీలో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను తయారు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏడాదికి 24 మిలియన్ ఫోన్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.

Tecno Phantom V Fold set to launch in India soon, price to be set under Rs 80,000

Tecno Phantom V Fold set to launch in India soon, price to be set under Rs 80K

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. సులభంగా మడతబెట్టేలా ఉంది. ఇందులో కీలు ఏరోస్పేస్-గ్రేడ్ మెటీరియల్‌లతో తయారైంది. స్టేబుల్ రొటేట్, స్లయిడ్ మెకానిజంను కలిగి ఉంటుంది, స్క్రీన్‌కు ఎలాంటి క్రీజ్‌లు లేదా నష్టం లేకుండా సులభంగా మడతపెట్టడానికి లేదా విప్పడానికి అనుమతిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 10Hz-120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.42-అంగుళాల FHD+ LTPO ఔటర్ AMOLED డ్యూయల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రైమరీ స్క్రీన్ అల్ట్రా-ఫ్లాట్, డ్యూయల్-హై బ్రైట్‌నెస్, డ్యూయల్-హై కలర్ కచ్చితత్వాన్ని కలిగి ఉంది. అదే రిఫ్రెష్ రేట్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

Tecno ఫాంటమ్ V ఫోల్డ్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50MP 2x పోర్ట్రెయిట్ లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎక్స్‌టీరియర్ స్క్రీన్‌పై, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంటర్నల్ డిస్‌ప్లేలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

గరిష్టంగా 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. Tecno ఫాంటమ్ V ఫోల్డ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C వంటి వివిధ కనెక్టివిటీ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది.

Read Also : Honda SP125 2023 Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!