Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

ప్రభాస్ సినిమా అంటే డార్లింగ్ కటౌట్ ఒక్కటి చాలు.. కానీ ఆ కటౌట్ ను ఢీకొట్టాలంటే పవర్ఫుల్ విలన్ కావాలి. బ్యూటిఫుల్ ఎపిక్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధేశ్యామ్ లో అలాంటి విలన్ లేడు..

Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

Prabhas

Prabhas: ప్రభాస్ సినిమా అంటే డార్లింగ్ కటౌట్ ఒక్కటి చాలు.. కానీ ఆ కటౌట్ ను ఢీకొట్టాలంటే పవర్ఫుల్ విలన్ కావాలి. బ్యూటిఫుల్ ఎపిక్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధేశ్యామ్ లో అలాంటి విలన్ లేడు.. హై రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండవు. కానీ గ్లోబల్ స్టార్ నెక్ట్స్ సినిమాల్లో విలన్స్ గా సూపర్ స్టార్స్ వచ్చేస్తున్నారు. వాళ్లతో రెబల్ స్టార్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ హైలైట్ అవబోతున్నాయి.

Prabhas : పూజాతో కిస్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా..

ప్రభాస్ ను ఢీకొట్టబోతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ విషయాన్ని స్వయంగా గ్లోబల్ స్టార్ కన్ఫర్మ్ చేశారు. రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కేరళలో ప్రెస్ మీట్ అటెండ్ అయిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ సలార్ మూవీలో మలయాళీ సూపర్ స్టార్ నటిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. పృధ్వీరాజ్ వాయిస్ ఓవర్ తోనే రాధేశ్యామ్ మలయాళ వర్షన్ రిలీజ్ కాబోతుంది. ఇక రాధేశ్యామ్ మూవీలో బలమైన విలన్ లేకుండా లవర్ బాయ్ ప్లస్ పామిస్ట్ గా కనిపించే ప్రభాస్.. తర్వాతి సినిమాల్లో మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ ను హై రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

Prabhas Marriage : అందుకే నాకింకా పెళ్ళికాలేదు.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్

ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సో మాస్ ప్యాక్డ్ బ్యాక్ డ్రాప్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ తో ఫైట్ అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అన్న ఎక్స్ పెక్టేషన్స్ సలార్ పై ఇప్పటినుంచే పెరుగుతున్నాయి. అటు 103 రోజుల్లో తన పార్ట్ కంప్లీట్ చేసిన ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీఖాన్, ప్రభాస్ నువ్వా నేనా అనుకోబోతున్నారు. రాముడిగా రెబల్ స్టార్ నటిస్తే… రావణుడిగా బాలీవుడ్ స్టార్ కనిపించబోతున్నాడు.

Prabhas : ‘రాధేశ్యామ్’ కోసం రాజమౌళి.. శివ రాజ్‌కుమార్.. పృథ్వీరాజ్

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే డీటెల్స్ పూర్తిగా బయటకు రాలేదు కానీ.. అమితాబ్ లాంటి లెజెండ్ యాక్టర్ తో వర్క్ చేస్తున్నారు డార్లింగ్. అటు సందీప్ రెడ్డి వంగా ప్రకటించిన స్పిరిట్ మూవీలో బాలీవుడ్ బెబో కరీనా కపూర్ లేడీ విలన్ అన్న ప్రచారమూ జరిగింది. ఇలా సినిమా సినిమాకు స్టార్ యాక్టర్స్.. విలన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. ప్రభాస్ సినిమా అంటే పడిపోయే ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు.