Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. 2023 జనవరిలో చైనాలో (Redmi K60 Series) ఫోన్ లాంచ్ కాబోతుంది.

Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Redmi K60 Series said to launch in January 2023

Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. 2023 జనవరిలో చైనాలో (Redmi K60 Series) ఫోన్ లాంచ్ కాబోతుంది. సాధారణంగా Redmi K సిరీస్ ఫోన్‌లను ప్రతి ఏడాదిలో డిసెంబర్‌లో ప్రకటించి ఆపై ప్రపంచ మార్కెట్లలో రిలీజ్ చేస్తుంటుంది. చైనీస్ వెబ్‌సైట్ MyDrivers వివరాల ప్రకారం.. ఈసారి రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌ను ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. షావోమీ (Xiaomi) ప్రస్తుతం Xiaomi 13 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అందుకే Redmi కొత్త డివైజ్‌లను ఆలస్యంగా ప్రకటించనుంది. వచ్చే నెలలో కంపెనీ 3 రెడ్‌మి ఫోన్‌లను రిలీజ్ చేయనుంది. Redmi K60, Redmi K60 Pro, Redmi K60E స్మార్ట్ ఫోన్లు ఉండవచ్చు.

Redmi K60 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. MIUI Polska రచయిత Kacper Skrzypek ఇటీవలే స్టాండర్డ్ మోడల్‌ను Qualcomm కొత్త Snpadragon 8+ Gen 2 SoC ద్వారా అందించవచ్చు. ఈ రెడ్‌మి ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1తో రావచ్చని భావిస్తున్నారు. Redmi K60E ఫోన్ MediaTek SoCని కలిగి ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.

Redmi K60 Series said to launch in January 2023

Redmi K60 Series said to launch in January 2023

Read Also : Redmi Smartphones : భారత మార్కెట్లో ఈ రెండు రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్.. ఏయే ఫోన్ ధర ఎంతంటే?

Geekbench లిస్టు ప్రకారం.. Snapdragon 870 SoCతో రానుంది. రాబోయే వారాల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Redmi K60 6.67-అంగుళాల డిస్‌ప్లే, 2K రిజల్యూషన్‌తో రానుంది. ఫ్లాట్ ప్యానెల్ కలిగి ఉంటుంది. పంచ్-హోల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. OISకి సపోర్టుతో 64-MP మెయిన్ సెన్సార్‌తో సహా, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు.

8-MP అల్ట్రావైడ్ సెన్సార్, 2-MP మాక్రో కెమెరాతో రావొచ్చు. Redmi K60 సిరీస్ కోసం అధికారిక లాంచ్ టైమ్‌లైన్ లేదా తేదీని Redmi ఇంకా వెల్లడించలేదని గమనించాలి. Xiaomi 13 సిరీస్ డిసెంబర్ 11న రాబోతోంది. కంపెనీ నుంచి ఫ్లాగ్‌షిప్ డివైజ్ కానుంది. వచ్చే ఏడాది ఎప్పుడైనా భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. Xiaomi లేటెస్ట్ MIUI 14 కస్టమ్ స్కిన్‌తో రానుంది. రాబోయే నెలల్లో, బ్రాండ్ రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 12 Series : వచ్చే జనవరిలో రెడ్‌‌మి నోట్ 12 సిరీస్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?