Redmi Note 12 Series : వచ్చే జనవరిలో రెడ్‌‌మి నోట్ 12 సిరీస్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి కొత్త రెడ్‌మి నోట్ (Redmi Note 12 Series) వస్తోంది. రెడ్‌మి ఇండియా (Redmi India)లో నోట్ 12 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

Redmi Note 12 Series : వచ్చే జనవరిలో రెడ్‌‌మి నోట్ 12 సిరీస్ వస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 Series expected to be launched in first week of January

Redmi Note 12 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి కొత్త రెడ్‌మి నోట్ (Redmi Note 12 Series) వస్తోంది. రెడ్‌మి ఇండియా (Redmi India)లో నోట్ 12 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం.. రెడ్‌మి కొత్త నోట్ 12 సిరీస్ (Redmi New Note 12 Series) జనవరి మొదటివారంలో లాంచ్ కానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల చైనాలో అందుబాటులోకి వచ్చింది. గత ఏడాదిలో భారత మార్కెట్లో వచ్చిన Note 11 సిరీస్‌కు రెడ్‌మి Note 12 సిరీస్ అప్‌గ్రేడ్ వెర్షన్.. ఇప్పుడు Redmi Note 12 సిరీస్ కింద Xiaomi మూడు ఫోన్‌లను ప్రవేశపెట్టింది. అందులో Redmi Note 12 Pro, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Plus మోడల్స్ ఉన్నాయి. మరోవైపు.. భారత మార్కెట్లో Xiaomi Pro మోడల్‌లను మాత్రమే రిలీజ్ చేస్తోంది.

Read Also : Redmi Note 11 Price : భారత్‌లో రెడ్‌మి నోట్ 11 ధర తగ్గిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

రెడ్‌మి కొత్త నోట్ సిరీస్‌ (Redmi New Note Series)ను జనవరి 5న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ముకుల్ శర్మ తెలిపారు. Redmi Note 12, Note 12 Pro, Pro+ అన్నీ మోడల్స్ 5G సపోర్టుతో రానున్నాయి.12 Pro+ మోడల్ 200MP ప్రధాన కెమెరాతో రానుందని తెలిపారు. Redmi నోట్ 12 Pro Plus భారత మార్కెట్లో 200-MP ప్రైమరీ కెమెరాతో వచ్చిన రెండవ ఫోన్ అని చెప్పవచ్చు. Motorola 200-MP సిరీస్‌తో Edge 30 Ultraను రిలీజ్ చేసింది.

Redmi Note 12 Series expected to be launched in first week of January

Redmi Note 12 Series expected to be launched in first week of January

Redmi Note 12 Pro+ : స్పెసిఫికేషన్‌లు ఇవే :

రెడ్‌మి నోట్ 12 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల Full-HD OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Note 12 Pro+ 8GB RAMతో పాటు MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా పనిచేస్తుంది. వెనుకవైపు Note 12 Pro+ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 200-MP OIS సెన్సార్, 8-MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16-MP సెన్సార్ ఉంది. స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టుతో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!