Rahul Gandhi: తన అధికారిక నివాసానికి రాహుల్ గాంధీ తిరిగి వెళ్తారా? నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?

రాహుల్ గాంధీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటుండగా శుక్రవారం సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది. 'రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు.. శిక్షపై స్టే విధించబడుతుంది' అని కోర్టు పేర్కొంది. కొత్త విచారణ తేదీని ఇంకా చెప్పలేదు

Rahul Gandhi: తన అధికారిక నివాసానికి రాహుల్ గాంధీ తిరిగి వెళ్తారా? నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?

Govt Bungalow: మోదీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ కూడా రాహుల్ గాంధీకి లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. కేరళలోని వాయనాడ్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రాహుల్ గాంధీ ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఎప్పుడు పొందుతారు అని. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.

Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించబడిన తర్వాత, ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ లోక్‌సభ హౌసింగ్ కమిటీకి మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఈ బంగ్లాను మరే ఇతర ఎంపీకి ఇంకా కేటాయించలేదు. రాహుల్ ఈ బంగ్లా కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఆయనకే కేటాయిస్తారు. మార్చి 23న రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో శిక్ష పడింది. అనంతరం మార్చి 24 న ఆయన ఎంపీగా అనర్హత వేటు పడింది. వెంటనే తుగ్లక్ లేన్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని నోటీసు వచ్చింది. నిబంధనల ప్రకారమే సమయానికి రాహుల్ గాంధీ బంగ్లాను ఖాళీ చేశారు. అనంతరం తన తల్లి సోనియా గాంధీ ప్రభుత్వ బంగ్లాకు మారారు.

Supreme Court: బీహార్‭లో కులగణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన అధిర్ రంజన్ చౌదరి.. సోమవారం లోక్‌సభ హౌసింగ్ కమిటీ ముందు రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లా అంశాన్ని లేవనెత్తారు. రాహుల్ గాంధీ తరపున బంగ్లా కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని సమాధానం వచ్చింది. ఏప్రిల్ 22న రాహుల్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు.

Madhya Pradesh: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి పట్టిస్తే రూ.10 వేలు ఇస్తారట. ప్రకటన చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే?

రాహుల్ గాంధీని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసు పంపడం పట్ల కేంద్రాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇక దీనికి అనుగుణంగా సోషల్ మీడియాలో ‘మేరా ఘర్ ఆప్కా ఘర్’ ప్రచారం కూడా మొదలైంది. ఇందులోభాగంగా మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని తమ వద్దే ఉండాలంటూ పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలికారు.

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీం విచారణ.. ప్రతి జిల్లాలో 6 సిట్‭లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ రాయ్ తన ఇంటిని రాహుల్ గాంధీకి ఇస్తానని చెప్పిన మొదటి వ్యక్తి. దేశంలోని నియంతలు మన అధినేత రాహుల్ గాంధీ ఇంటిని లాక్కోవాలని చూస్తున్నారని, అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తల ఇల్లు రాహుల్ గాంధీకి చెందుతుందని వారికి తెలియదని అజయ్ రాయ్ అన్నారు. అయితే, రాహుల్ గాంధీ 10 జన్‌పథ్‌లోని తన తల్లి ప్రభుత్వ బంగ్లాకు మారారు.

Ram Shankar Katheria: రాహుల్ గాంధీలాగే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోబోయి కాస్తంతలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ

రాహుల్ గాంధీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటుండగా శుక్రవారం సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది. ‘రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు.. శిక్షపై స్టే విధించబడుతుంది’ అని కోర్టు పేర్కొంది. కొత్త విచారణ తేదీని ఇంకా చెప్పలేదు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, “ట్రయల్ కోర్టు గరిష్ట శిక్ష ఎందుకు విధించిందో తెలుసుకోవాలనుకుంటున్నాం? జడ్జి ఈ విషయాన్ని తీర్పులో పేర్కొనాల్సింది. ఒకవేళ న్యాయమూర్తి 1 సంవత్సరం 11 నెలల గడువు ఇస్తే.. రాహుల్ గాంధీ అనర్హులు కాలేరు. గరిష్ఠ శిక్ష కారణంగా, ఒక లోక్‌సభ స్థానం ఎంపీ లేకుండానే మిగిలిపోతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి హక్కులకు సంబంధించిన విషయం కాదు, ఆ సీటు ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశం కూడా’’ అని కోర్టు పేర్కొంది.

Gaddar Funeral: గద్దర్ అంతిమయాత్రలో తొక్కిసలాట.. గద్దర్ స్నేహితుడి మృతి

అయితే, సుప్రీంకోర్టు తన నిర్ణయంలో రాహుల్ గాంధీని కూడా హెచ్చరించింది. ప్రసంగంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలో తమకు సైతం అభ్యంతరం ఉందని పేర్కొంది. నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇలా అలవాటైతే అది కర్తవ్యంగా మారుతుందని రాహుల్‌గాంధీకి కోర్టు పేర్కొంది.