Manipur Violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీం విచారణ.. ప్రతి జిల్లాలో 6 సిట్‭లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులను విచారించేందుకు సీనియర్ మహిళా అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నుంచి డీఐజీ ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటారట

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీం విచారణ.. ప్రతి జిల్లాలో 6 సిట్‭లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం

SC hearing Manipur Violence: మణిపూర్ హింసాకాండ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 6,500 ఎఫ్‌ఐఆర్‌లను వర్గీకరించి కోర్టుకు అందుబాటులో ఉంచామని అటార్నీ జనరల్ వెంకటరమణి తెలిపారు. ఇక మణిపూర్ అంశాన్ని చాలా పరిణతితో చూడాలని, వివిధ రకాల సిట్‌లను ఏర్పాటు చేయాలని సూచించినట్లు కోర్టు ముందు ఆయన పేర్కొన్నారు. హత్య కేసులను విచారిస్తున్న సిట్‌కు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు.

2024 Elections: వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో బీజేపీ కుంభస్థలాన్ని దెబ్బకొట్టేందుకు కీలక పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, ఆప్

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులను విచారించేందుకు సీనియర్ మహిళా అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి నుంచి డీఐజీ ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటారట. డీజీపీ కూడా ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తారని తెలిపారు. హింసాత్మకంగా ప్రభావితమయ్యే ప్రతి జిల్లాలో 6 సిట్‌లను ఏర్పాటు చేస్తామని అటార్నీ జనరల్ వెంకటరమణి తెలిపారు. గతంలో సీబీఐకి అప్పగించిన 11 కేసులను సీబీఐ మాత్రమే విచారిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో సీబీఐ మహిళా అధికారులు కూడా పాల్గొంటారు.

Madhya Pradesh: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి పట్టిస్తే రూ.10 వేలు ఇస్తారట. ప్రకటన చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే?

విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. బాధిత మహిళలతో మాట్లాడేందుకు మహిళా సామాజిక కార్యకర్తల ఉన్నత స్థాయి కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మృతదేహాలను కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పరిస్థితిని క్లిష్టంగా ఉంచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు విచారణకు ముందు ప్రతిసారీ ఏదో ఒక సంఘటన జరుగుతుందని, ఇది యాదృచ్చికమా, ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా అని విచారణ జరగాలని జైసింగ్ అన్నారు.