Reliance Digital : రిలయన్స్ నుంచి 100GB ఫ్రీ డేటాతో HP Smart SIM ల్యాప్‌టాప్.. వారికి మాత్రమే!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త HP Smart SIM ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది.

Reliance Digital : రిలయన్స్ నుంచి 100GB ఫ్రీ డేటాతో HP Smart SIM ల్యాప్‌టాప్.. వారికి మాత్రమే!

Reliance Digital Announces Hp Smart Sim Laptop With Free 100gb Data

Reliance Digital : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త HP Smart SIM ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది. HP స్మార్ట్ సిమ్ లైఫ్ అనేది ఫస్ట్ టైప్ స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ అందిస్తోంది. అర్హత కలిగిన యూజర్లకు HP స్మార్ట్ సిమ్‌తో కాంప్లిమెంటరీ కింద రిలయన్స్ డిజిటల్ ఆఫర్ చేస్తోంది. 100GB డేటాతో Jio డిజిటల్ లైఫ్ బెనిఫిట్స్ యూజర్లకు అందిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే.. మీరు HP నుంచి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే.. మీరు 100GB ఉచిత డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు Jio HP స్మార్ట్ సిమ్ అవసరమని గమనించాలి. అయితే ఈ కొత్త ఆఫర్ అందరి యూజర్లకు అందుబాటులో లేదు. ఎంపిక చేసిన HP ల్యాప్‌టాప్‌ల కొత్త కస్టమర్‌లకు మాత్రమే 100GB ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. మీరు 100 GB ఉచితంగా పొందాలంటే రిలయన్స్ డిజిటల్ అందించే ఆఫర్‌కు అర్హత పొందాల్సి ఉంటుంది.

కొత్త HP యూజర్లకు HP LTE ల్యాప్‌టాప్‌తో కొత్త Jio SIMకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 365 రోజుల (రూ.1500 విలువ) 100 GB డేటాను పొందవచ్చు. మీరు HP అర్హత కలిగిన ల్యాప్‌టాప్‌లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. యూజర్లు కొనుగోలు చేసే రెండు అర్హత కలిగిన మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. HP 14ef1003tu, HP 14ef1002tu వంటివి ఉన్నాయి. మీరు అర్హత కలిగిన డివైజ్ కొనుగోలు చేస్తే.. మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త Jio SIMని పొందవచ్చు. రూ. 1500 విలువైన డేటాను ఏడాదికి 100 GB వరకు ఉచితంగా అందిస్తుంది. 100 GB డేటా ముగిసిన తర్వాత.. ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps వరకు తగ్గిపోతుంది. యూజర్లు అదనపు హై స్పీడ్ 4G డేటా కోసం MyJio లేదా Jio.com లో డేటా ప్యాక్‌లు / ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

Reliance Digital Announces Hp Smart Sim Laptop With Free 100gb Data (1)

Reliance Digital Announces Hp Smart Sim Laptop With Free 100gb Data

ఆఫ్‌లైన్‌లో మీరు ఆఫర్‌ పొందాలంటే? :
— మీరు కొత్త HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలంటే సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కి వెళ్లవచ్చు.
— HP Smart LTE 100 GB డేటా ఆఫర్ (FRC 505 ఆఫర్ పేరు)లో కొత్త Jio SIMని యాక్టివేట్ చేయమని రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఎగ్జిక్యూటివ్‌ని అడగండి.
– డాక్యుమెంటేషన్ కోసం మీ వివరాలను ఇవ్వండి
— ఫుల్ యాక్టివేషన్ తర్వాత HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌లో SIM ఇన్‌సర్ట్ చేయండి.
– ఉచిత ఇంటర్నెట్‌ని పొందండి.

ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం..
— కొత్త HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలంటే.. reliancedigital.in లేదా JioMart.comకి వెళ్లండి
— మీరు ల్యాప్‌టాప్ డెలివరీ చేసిన తర్వాత.. కొనుగోలు చేసిన 7 రోజులలోపు కొనుగోలు ఇన్‌వాయిస్, ల్యాప్‌టాప్‌తో సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సందర్శించండి.
— మీరు HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ 100 GB డేటా ఆఫర్ (FRC 505)లో కొత్త Jio కనెక్షన్‌ని యాక్టివేట్ చేయమని స్టోర్ ఎగ్జిక్యూటివ్‌ని అడగవచ్చు.
– డాక్యుమెంటేషన్ కోసం మీ వివరాలను ఇవ్వండి.
— SIM యాక్టివేట్ అయినప్పుడు HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌లో SIMని చేర్చండి.
– జెర్నీ సమయంలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ని పొందండి.

Read Also : Reliance Jio : రిలయన్స్ జియో నుంచి గేమ్ కంట్రోలర్.. ఫీచర్లు, ధర ఎంతంటే?