Reliance Jio : రిలయన్స్ జియో నుంచి గేమ్ కంట్రోలర్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Reliance Jio : రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి గేమ్ కంట్రోలర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రొడక్టును జియో అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది. ఈ గేమింగ్ కంట్రోలర్ యూజర్లకు ఒకే ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదని పేర్కొంది.

Reliance Jio Launches Game Controller In India Check Out Price And Features
Reliance Jio : రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి గేమ్ కంట్రోలర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రొడక్టును జియో అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది. ఈ గేమింగ్ కంట్రోలర్ యూజర్లకు ఒకే ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదని పేర్కొంది. టెలికాం ఆపరేటర్ నుంచి ఇలాంటి ప్రొడక్టు రావడం ఇదే మొదటిసారి. గతంలో జియో ఇంతకుముందు ఫీచర్ ఫోన్‌లను మాత్రమే ప్రవేశపెట్టింది. గత ఏడాదిలో జియో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఇప్పుడు, పోర్ట్‌ఫోలియోకు కొత్త ప్రొడక్టును జోడించింది.
ఈ కొత్త గేమ్ కంట్రోలర్ అన్ని ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ఆండ్రాయిడ్ టీవీ, ఇతర డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుందని జియో అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. యూజర్లు జియో సెట్-టాప్ బాక్స్‌తో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. Tata Play (గతంలో Tata Sky) స్మార్ట్ సెట్-టాప్ బాక్స్‌తో సర్వీసు పొందే కేబుల్ టీవీ ఛానెల్‌లకు జియో గేమ్ కంట్రోలర్ యాక్సెస్‌ను అందించదు. ఈ సెట్-టాప్ బాక్స్ యూజర్ల OTT ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే కంటెంట్‌ని చూసేందుకు అనుమతిస్తుంది. కొన్ని లైవ్ టెలిక్యాస్ట్ టీవీ కార్యక్రమాలు, ఇతర వీడియోలను చూసే JioTV+ యాప్ కూడా ఉంది. Jio గేమ్ కంట్రోలర్‌కు కనెక్షన్ బ్లూటూత్ v4.1 టెక్నాలజీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. 10 మీటర్ల వరకు వైర్‌లెస్ పరిధిని అందిస్తుంది. యూజర్లు మొత్తం 8 గంటల బ్యాటరీ లైఫ్ పొందుతారని జియో పేర్కొంది.

Reliance Jio Launches Game Controller In India Check Out Price And Features
ఈ డివైజ్ 20-బటన్లతో వచ్చింది ఇందులో రెండు ప్రెజర్ పాయింట్ ట్రిగ్గర్‌లు, 8-డైరెక్షన్ బటన్ ఉన్నాయి. జియో నుంచి కొత్త గేమింగ్ కంట్రోలర్ రెండు జాయ్‌స్టిక్‌లను కూడా అందిస్తుంది. కంట్రోలర్‌లో రెండు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ మోటార్లు ఉన్నాయని హాప్టిక్ కంట్రోల్‌కి సపోర్టు ఇస్తుందని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ధర విషయానికొస్తే.. కొత్త జియో గేమ్ కంట్రోలర్ యూజర్లకు రూ. 3,499 ఖర్చు అవుతుంది. అధికారిక వెబ్‌సైట్ డివైజ్.. ఒకే మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌లో మాత్రమే పొందవచ్చు. Jio.com వెబ్‌సైట్‌లో కనిపించే EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం Amazon, Flipkartలో లిస్టు చేయలేదు. Jio గేమ్ కంట్రోలర్ జాబితా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తిగల యూజర్లు అధికారిక Jio సైట్ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
Read Also : Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!