Saindhav: సైంధవ్ నుండి సాలిడ్ అప్డేట్.. రేణు వస్తోందట!
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Saindhav: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో వెంకటేష్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.
Saindhav : వెంకీ మామ అప్డేట్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నాడు..
ఇక రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు ఓ కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెరిగింది. ఇక ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింతగా పెంచేలా ఈ మూవీ నుండి మరో సాలిడ్ అప్డేట్ను ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రేణు అనే పాత్రలో మరో హీరోయిన్ నటిస్తుందని.. ఈ పాత్రకు సంబంధించిన అప్డేట్ను ఏప్రిల్ 21న ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Saindhav Movie: కీలక షెడ్యూల్‌ను ముగించుకున్న వెంకీ సైంధవ్ మూవీ
ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా సైంధవ్ వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Intense, determined and kind hearted ❤️🔥
“Renu” will play a key role in #SAINDHAV’s mission 💥
Unveiling Tomorrow at 11:07 AM ⏳
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75
— Niharika Entertainment (@NiharikaEnt) April 20, 2023