Saindhav Movie: కీలక షెడ్యూల్‌‌ను ముగించుకున్న వెంకీ సైంధవ్ మూవీ

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెంగ్తీ షెడ్యూల్‌ను తాజాగా ముగించింది చిత్ర యూనిట్.

Saindhav Movie: కీలక షెడ్యూల్‌‌ను ముగించుకున్న వెంకీ సైంధవ్ మూవీ

Venkatesh Saindhav Movie Wraps Key Schedule

Saindhav Movie: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Saindhav : వెంకీ మామ మాస్ రూపం.. క్రిస్మస్ రిలీజ్‌కి రెడీ అంటున్న సైంధ‌వ్..

వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లెంగ్తీ షెడ్యూల్‌ను తాజాగా ముగించింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ ఔట్‌పుట్ చూసి చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తుండంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Saindhav : సైంధవ్ అప్డేట్.. రాంపేజ్ అంటున్న వెంకటేష్!

ఈ ప్రెస్టీజియస్ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధీఖి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోండగా, పలువురు పాపులర్ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.