Saindhav : వెంకీ మామ మాస్ రూపం.. క్రిస్మస్ రిలీజ్‌కి రెడీ అంటున్న సైంధవ్..
హిట్, హిట్ 2 సినిమాలని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ 75 వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సైంధవ్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా....................

Venkatesh Saindhav Movie Release date announced
Saindhav : టాలీవుడ్(Tollywood) లో అందరికి నచ్చే హీరోల్లో వెంకటేష్(Venkatesh) ఒకరు. వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేష్ ఇప్పటికే 74 సినిమాలు పూర్తి చేసి 75వ సినిమాతో రాబోతున్నాడు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ మధ్యమధ్యలో డిఫరెంట్ పాత్రలు కూడా పోషించాడు. ఇటీవల రానా నాయిడు(Rana Naidu) సిరీస్ లో అయితే అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్ పోషించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం వెంకటేష్ 75 వ సినిమాని ప్రకటించారు. హిట్, హిట్ 2 సినిమాలని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ 75 వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సైంధవ్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మాస్ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. క్రిస్మస్ కానుకగా 22 డిసెంబర్ 2023న సైంధవ్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో పాటు వెంకీ మామది ఓ మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో వెంకటేష్ ని మరోసారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూడొచ్చని అభిమానులు, ప్రేక్షకులు సైంధవ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
#SAINDHAV in theatres worldwide on DEC 22nd 2023❤️#SaindhavOnDEC22 @Nawazuddin_S @KolanuSailesh @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/B2bSiwetPn
— Venkatesh Daggubati (@VenkyMama) March 29, 2023