Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చైతన్య..

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

Naga Chaitanya Samantha

Naga Chaitanya-Samantha: తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చైతన్య ప్రకటించగా గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఇదే కథలు కథలుగా మారింది. ఎవరికి వారు దీనికి కారణమేంటని.. దీని వెనుకున్న రహస్యమేంటని ఛేదించే ప్రయత్నాలు కూడా చేసి అలసిపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా సాక్షిగా చై, సామ్ తో పాటు మరికొందరు చేసే ట్వీట్స్ కూడా మరింత చర్చగా మారుతుంది.

Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్‌!

మరీ ముఖ్యంగా విడాకుల ప్రకటనకు ముందు.. ప్రకటన తర్వాత సమంతా చేసిన ట్వీట్స్ అంతటా చర్చనీయాంశంగా మారాయి. తమ అభిమాన నటులు, అందునా ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట ఇలా విడిపోవడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ఇష్టపడే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఏ మాయ చేసావే నుండి మజిలీ వరకు ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ హిట్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు మరోసారి అలా చూడాలని కోరుకుంటున్నారు.

Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!

చైతూ.. సామ్ మరోసారి కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు. రోజు రోజుకూ ఈ విన్నపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఈ ఇద్దరికి సంబంధించిన కథనాలకు కామెంట్ల రూపంలో.. సోషల్ మీడియా పోస్టుల రూపంలో ఈ విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. మరి అభిమానుల విన్నపాలను ఈ జంట యాక్సెప్ట్ చేస్తుందా.. ఫ్యూచర్ లో అయినా ఈ జంట మళ్ళీ కలిసి నటించే అవకాశం ఉంటుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.