Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!

సోమవారం రాత్రి ఒక్కసారిగా వాట్సప్, పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. మంగళవారం వేకువ జాము వరకు తిరిగి ఇవి పనిచేయలేదు. ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ సమయంలో ఇవి..

Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!

Shruti Haasan

Shruti Haasan: సోమవారం రాత్రి ఒక్కసారిగా వాట్సప్, పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. మంగళవారం వేకువ జాము వరకు తిరిగి ఇవి పనిచేయలేదు. ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ సమయంలో ఇవి నిలిచిన దాఖలాలు లేవు. ఇవి కాస్త నిలిచిపోవడంతో చాలామందికి అసలు ఏమీ తోచలేదు. మరికొందరైతే ప్రత్యామ్నాయంగా ట్విట్టర్, టెలిగ్రామ్ ఎక్కువగా వినియోగించారు. సెలబ్రిటీలైతే ఎక్కువగా ట్విట్టర్ లో వాలిపోయి చాటింగ్, లైవ్ సెషన్స్ పెట్టి నెటిజన్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

తెలుగు, తమిళ బాషలతో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ట్విట్టర్ లో ఒక చాట్ సెషన్ పెట్టింది. నెటిజన్లతో పిచ్చాపాటి కబుర్లు మొదలుపెట్టిన శృతి తనని ఏమన్నా అడగాలి అనుకుంటే అడగొచ్చని ఆఫర్ ఇచ్చింది. మరి నెటిజన్లు ఊరికే ఉంటారా.. కొందరు కుశల ప్రశ్నలతో పాటు తన సినిమా వివరాలను అడిగితే ఓ నెటిజన్ మాత్రం శృతి నీ ఫోన్ నెంబర్ చెప్పవా అని అడిగేశాడు. దీనికి శృతి కూడా షాకింగ్ ఆన్సర్ ఇచ్చేసింది.

Samantha: టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేయనున్న సామ్?

నెటిజన్ అడిగిన ఫోన్ నెంబర్ ప్రశ్నకు శృతి జవాబుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ‘100’ అని రిప్లై ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి అంతా నవ్వుతున్నారు. దెబ్బకు ఇది వైరల్ కూడా అవ్వడం మొదలయ్యింది. శృతి ఏ మాత్రం క్లాస్ పీకకుండా జస్ట్ అలా మొహం మీద కొట్టినట్లు ఫన్నీగా చెప్పిన ఆన్సర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సహా పలు తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది.