RGV : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా చావులు అంటూ.. ఆర్జీవీ నెక్స్ట్ మూవీ ‘కొవిడ్ ఫైల్స్’..

‘కొవిడ్‌ ఫైల్స్‌’ సినిమాతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.....

RGV :  ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా చావులు అంటూ.. ఆర్జీవీ నెక్స్ట్ మూవీ ‘కొవిడ్ ఫైల్స్’..

Covid Files

RGV :  కరోనా సమాజంలో, మనుషుల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద కరోనా వల్ల చాలా మంది చనిపోయారు. కనీసం చనిపోయిన వాళ్ళ చివరి చూపు కూడా దక్కలేదు. ఈ విషయంలో భారతదేశంలో కరోనా చావులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కారణం అని చాలా మంది విమర్శించారు. తాజాగా ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ఇలాంటి నిజ సంఘటనలని అద్భుతంగా తెరకెక్కించగలిగే ఆర్జీవీ ‘కొవిడ్ ఫైల్స్’ అనే సినిమాని తీయబోతున్నాను అని ప్రకటించాడు.

‘కొవిడ్‌ ఫైల్స్‌’ సినిమాతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించి వరుస ట్వీట్స్ పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ ట్వీట్స్ లో.. ”భయానకమైన కరోనా సెకండ్‌వేవ్‌ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్‌ కాదు. అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. దాన్ని ‘కొవిడ్‌ ఫైల్స్‌’ సినిమా నిరూపిస్తుంది. కరోనా సమయంలో లక్షలమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్యపూరిత, అయోగ్యమైన పరిపాలన యంత్రాంగం తీరును ఈ సినిమా చూపిస్తుంది. ఇదొక రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా. ఇందులో చూపించే కఠోర వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావాన్ని కూడా ‘కొవిడ్‌ ఫైల్స్‌’ సినిమా చూపిస్తుంది” అని పోస్ట్ చేశారు వర్మ.

Tanushree Dutta : లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నా కెరీర్ నాశనం చేస్తుంది బాలీవుడ్ మాఫియా

కరోనా చావులకు కారణం కరోనా కాదు అధికారులు, ప్రభుత్వం అంటూ దానిపైన సినిమా ప్రకటించడంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. మరి ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు, ఎన్ని నిజాలు చూపిస్తారో అని సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.