Tanushree Dutta : లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నా కెరీర్ నాశనం చేస్తుంది బాలీవుడ్ మాఫియా

తాజాగా మరోసారి తనుశ్రీ మీటూపై స్పందించింది. తనుశ్రీ మాట్లాడుతూ.. ''నేను లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నన్ను ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్ ని................

Tanushree Dutta :  లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నా కెరీర్ నాశనం చేస్తుంది బాలీవుడ్ మాఫియా

Tanushree Dutta :  బాలీవుడ్‌ నటి, ఒకప్పటి హీరోయిన్‌ తనుశ్రీ దత్తా గతంలో ‘మీ టూ’ ఉద్యమం పేరుతో బాగా పాపులర్ అయింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తనని శారీరంగా వేధించాడంటూ, చాలా మంది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వాడుకుంటారని సంచలన ఆరోపణలు చేసింది. తనుశ్రీ చేసిన మీటూ ఉద్యమం దేశమంతా పాకి చాలా మంది ఇందులో పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమకి ఎదురైన అనుభవాలని షేర్ చేశారు.

ChaySam : సమంతని, నాగ చైతన్యని ఒకే రూమ్ లో ఉంచితే?? కరణ్ ప్రశ్నకి సమంత ఆన్సర్??

తాజాగా మరోసారి తనుశ్రీ మీటూపై స్పందించింది. తనుశ్రీ మాట్లాడుతూ.. ”నేను లైంగిక వేధింపులపై మాట్లాడినందకు నన్ను ఇప్పటికి కూడా వేధిస్తున్నారు. మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్ ని నాశనం చేయాలని చూస్తున్నారు. నా మీద చాలా కుట్రలు చేస్తున్నారు బాలీవుడ్ మాఫియా వాళ్ళు. ఎన్ని కుట్రలు చేసినా నేను సినీ పరిశ్రమని వదిలి వెళ్ళను. మళ్ళీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను. బాలీవుడ్ మాఫియా నటిగా నా కెరీర్ ని అంతం చేయాలని చూస్తుంది” అని తెలిపింది.