RGV-Upendra: ఉప్పీతో వర్మ.. అభిమానులలో బోలెడు ఆశలు.. మరి రిజల్ట్?

ఒకప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇప్పుడు కాంట్రవర్శియల్ డైరెక్టర్.. కన్నడ సూపర్ స్టార్ తెలుగులో సెన్సషనల్ స్టార్ ఉపేంద్ర కలిస్తే ఎలా ఉంటుంది.

RGV-Upendra: ఉప్పీతో వర్మ.. అభిమానులలో బోలెడు ఆశలు.. మరి రిజల్ట్?

Rgv Upendra

RGV-Upendra: ఒకప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇప్పుడు కాంట్రవర్శియల్ డైరెక్టర్.. కన్నడ సూపర్ స్టార్ తెలుగులో సెన్సషనల్ స్టార్ ఉపేంద్ర కలిస్తే ఎలా ఉంటుంది. ఈ క్రేజీ కాంబినేసన్ లో సినిమా వస్తే ఇంకెలా ఉంటుంది? అప్పుడెప్పుడో వీళ్ల కాంబోలో సినిమా అనౌన్స్ చేసి, అభిమానులను ఆశ్ఛర్య పరిచారు ఆర్జీవి. లేటెస్ట్ గా ఆ సినిమా వివరాలతో పాటు టైటిల్ టీజర్ రిలీజ్ చేసి, ఈ ఇద్దరి ఫాన్స్ ను ఎట్రాక్ట్ చేశారు.

RGV-Upendra: ఉప్పీతో ఆర్జీవీ.. మరోసారి మాఫియా యాక్షన్ డ్రామా!

రాత్‌, భూత్‌, జీఎస్టీ, రక్త చరిత్ర, కొండా అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నఆర్జీవీ, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేశారు. ఓ భయంకరమైన గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో రానున్న ఈ సినిమా కు ఆర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆర్ గ్యాంగ్ అరాచకాలను, కిరాతకాలను ఆర్జీవి మేకింగ్ లో ఉప్పి స్టయిల్ లో ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

RGV : ఇంత అందంతో నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు.. యాంకర్ శ్యామల పై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

బాలీవుడ్ లో సత్య, కంపెనీ, సర్కార్ లాంటి బిగెస్ట్ యాక్షన్ సినిమాలను రూపొందించిన ఆర్జీవి ఈ మధ్య కాంట్రవర్శియల్ సినిమాలే చేస్తున్నారు. కాంట్రవర్సీతోనూ అద్భుతాలు క్రియేట్ చేయొచ్చని.. ప్రతీ అద్భుతం ముందుగా కాంట్రవర్సే అవుతుందని పరిచయం చేసినా కూడా వర్మ గతంలో చేసిన శివ, సత్య, కంపెనీ లాంటి సినిమాలనే ఆడియన్స్ కోరుకుంటున్నారు. మరి వర్మ, కన్నడ ఫిలిం మేకర్ కమ్ స్టార్ హీరో ఉపేంద్రతో సినిమా అనగానే, అదీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ అని రివీల్ చేయగానే ఆర్జీవి కమ్ బ్యాక్ అవుతాడని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

RGV : పబ్‌లో ఆర్జీవీ రచ్చ.. నటితో ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్..

గత సంవత్సరం సెప్టెంబర్ 18న ఉపేంద్ర కు బర్త్ డే విషెస్ అందిస్తూ ఆర్జీవి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ట్వీట్ చేశారు. కాని, దాని గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో ఆ సినిమా ఉండనుకున్నారంతా.. లేటెస్ట్ గా ఆ సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ చేసి, అందరికీ షాకిచ్చాడు ఆర్జీవి. మరి ఈ సినిమా పాత ఆర్జీవీని గుర్తు చేస్తుందా.. లేక వర్మ కాంపౌండ్ నుండి వచ్చే మూస సినిమాలలాగే మిగిలిపోతుందో చూడాలి.