RGV : ధనుష్ ఐశ్వర్య విడాకులపై వర్మ ట్వీట్లు

ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా వీరి విడాకులని ఉద్దేశించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ చేశారు.

RGV : ధనుష్ ఐశ్వర్య విడాకులపై వర్మ ట్వీట్లు

Rgv

RGV :  కోలీవుడ్ ఫేమస్ కపుల్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు. నిన్న సాయంత్రం ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిన్నటి నుంచి వీరి విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. వీరి విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో లాగా కామెంట్ చేస్తున్నారు. తాజాగా వీరి విడాకులని ఉద్దేశించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ చేశారు.

 

రామ్ గోపాల్ వర్మ పెళ్ళిళ్ళని వ్యతిరేకిస్తారని మనకి తెలిసిందే. గతంలో కూడా చాలా సార్లు ఆయన పెళ్ళిళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వారే. అంతేకాక ఆర్జీవీ కూడా గతంలో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వారే. కొన్ని రోజుల క్రితం అమిర్ ఖాన్ కిరణ్ రావు, మొన్న సమంత నాగచైతన్య, ఇవాళ ధనుష్ ఐశ్వర్య ఇలా వరుసగా సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడంతో ఆర్జీవీ ఈ విడాకులని ఉద్దేశించి తన స్టైల్ లో ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.

Dhanush : అటు అన్నదమ్ములు.. ఇటు అక్క చెల్లెల్లు.. విడాకుల పర్వం

”వివాహాలు ప్రమాదాల లాంటివి అని వాటి గురించి యువతను హెచ్చరించడానికి స్టార్లు వరుసగా విడాకులు తీసుకోవడం మంచి ట్రెండ్ సెట్టర్‌ గా నిలుస్తుంది అన్నారు. అలాగే వివాహం అనేది బాధని, హ్యాపినెస్ లేకపోవడాన్ని నిరంతర చక్రంగా ఉంచడానికి మన దుష్ట పూర్వీకులు కనిపెట్టారు. వివాహంలో ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. వివాహం తర్వాత 3 నుండి 5 రోజుల వరకు ఆ ప్రేమ ఉంటుంది అంతే. పెళ్లి కంటే వేగంగా ప్రేమించే హత్యలు ఏవీ లేవు. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యం. తెలివైన వ్యక్తులు ప్రేమిస్తారు. తెలివి తక్కువ వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. విడాకులు మాత్రమే సంగీత్‌తో జరుపుకోవాలి. ఒకరి ప్రమాదకర లక్షణాలను మరొకరు తెలుసుకునే వివాహ ప్రక్రియ నిశ్శబ్దంగా జరగాలి.” అని వరుస ట్వీట్స్ చేశారు.