Rohit Sharma : రోహిత్ శర్మ కారు నంబర్‌కి అతడి రికార్డుకు ఉన్న సంబంధం తెలుసా..?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన హిట్‌మ్యాన్ టెస్టు, వన్డే సిరీసుల్లో పాల్గొన్నాడు.
![Rohit Sharma : రోహిత్ శర్మ కారు నంబర్‌కి అతడి రికార్డుకు ఉన్న సంబంధం తెలుసా..? Rohit Sharma : రోహిత్ శర్మ కారు నంబర్‌కి అతడి రికార్డుకు ఉన్న సంబంధం తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/08/Rohit-Sharma.jpg)
Rohit Sharma
Rohit Sharma Lamborghini Car number : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన హిట్‌మ్యాన్ టెస్టు, వన్డే సిరీసుల్లో పాల్గొన్నాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. తనకు లభించిన సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. తన భార్య రితికా సజ్దెతో కలిసి అమెరికాకు వెళ్లాడు. గతవారం కాలిఫోర్నియాలో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చాడు.
తాజాగా హిట్‌మ్యాన్ తన భార్యతో కలిసి ముంబైలోని ఓ అడిడాస్ స్టోర్‌కు వెళ్లాడు. రోహిత్ శర్మను గమనించిన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అతడితో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కాసేపు అక్కడ ఉన్న రోహిత్ ఆ తరువాత తన భార్యతో కలిసి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అందరి దృష్టి రోహిత్ కారుపై పడింది.
Tilak varma : వన్డే ప్రపంచకప్ రేసులో హైదరాబాదీ కుర్రాడు..? కష్టమే అయినా అసాధ్యం కాదు..!
రోహిత్ బ్లూ కలర్ ‘లంబోర్ఘినీ ఉరుస్’ (Lamborghini Urus) లగ్జరీ కారులో వచ్చాడు. దీని ధర సుమారుగా రూ.4.20కోట్లుగా ఉంటుంది. ఆ కారు నంబర్ MH 01 EB 0264. ఇక్కడ మీరు ఓ విషయాన్ని గమనించారా..? అదే కారు నంబర్ లో ఉన్న 264. అదేమీ ఫ్యాన్సీ నంబర్ కాదు కదా..? ఇందులో ఏమి ఉందని అంటారా..? అక్కడికే వస్తున్నాం ఆగండి. రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక స్కోరు ఎంతో తెలుసా..? 264 పరుగులు. దీనినే తన కారు నంబరుగా 0264గా తీసుకున్నాడు హిట్‌మ్యాన్. ఈ కారును రోహిత్ శర్మ గతేడాది మార్చిలో కొన్నాడు.
ఆగస్టు 31 నుంచి మొదలయ్యే ఆసియా కప్‌లో టీమ్ఇండియాకు రోహిత్ సారథ్యం వహించనున్నాడు. స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబరు 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ కెప్టెన్సీలోనే భారత్ ఆడనుంది. 2011 ప్రపంచకప్ గెలుచుకున్న తరువాత టీమ్ఇండియా మరోసారి విశ్వ విజేతగా నిలవలేదు. ఆ లోటును రోహిత్ శర్మ పూడ్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Rohit Sharma and his wife in the Lamborghini. pic.twitter.com/AY4QwllWA6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023