Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్‌ను గ‌త నెల‌లో బీసీసీఐ కార్య‌ద‌ర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు జై షా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా మ్యాచ్‌లు ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యాన్ని వెల్ల‌డించారు.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

Asia Cup 2023

Asia Cup 2023 : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా క‌ప్ 2023(Asia Cup) షెడ్యూల్‌ను గ‌త నెల‌లో బీసీసీఐ కార్య‌ద‌ర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్య‌క్షుడు జై షా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా మ్యాచ్‌లు ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యాన్ని వెల్ల‌డించారు. ఆగ‌స్టు 30 నుంచి ఆసియా క‌ప్ ప్రారంభం కానుండ‌గా సెప్టెంబ‌ర్ 17న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ సారి ఆసియా క‌ప్‌ను వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీని నిర్వ‌హిస్తుండ‌గా మొత్తం 13 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల‌కు పాకిస్తాన్‌, మిగిలిన మ్యాచ్‌ల‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ ఆగ‌స్టు 30న పాకిస్తాన్‌, నేపాల్ జ‌ట్ల మ‌ధ్య పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదిక‌గా ఆరంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే దాయాదులు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు సెప్టెంబ‌ర్ 2న త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంక‌లోని క్యాండీ వేదిక కానుంది.

Suryakumar Yadav: టీ20ల్లో వంద సిక్స్‌ల క్లబ్‌లో సూర్యకుమార్.. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు వీరే ..

ఈ టోర్నీలో మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధిస్తాయి. సూప‌ర్-4 ద‌శ‌లో ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కొలొంబో వేదిక‌గా సెప్టెంబర్ 17న ఫైనల్ జరగనుంది.

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్

ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక‌ ముల్తాన్

ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక‌ క్యాండీ

సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక‌ లాహోర్

IND vs WI 3rd T20 : సూర్య‌కుమార్ విధ్వంసం.. బోణీ కొట్టిన భార‌త్‌.. మూడో టీ20లో విజ‌యం

సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక‌ లాహోర్

సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక‌ కొలంబో

సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక‌ కొలంబో

ఇక మ్యాచ్‌లు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.

మూడు సార్లు పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డే ఛాన్స్‌..!

ఆసియా క‌ప్‌లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. గ్రూపు ద‌శ‌లో మొద‌టి సారి ఆడతాయి. ఇరు జ‌ట్లు సూప‌ర్‌-4కు అర్హ‌త సాధిస్తే అక్క‌డ‌ మ‌రోసారి త‌ల‌ప‌డ‌తాయి. ఒక‌వేళ భార‌త్‌, పాక్‌లు సూప‌ర్‌-4 ద‌శ‌లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఫైన‌ల్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి త‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది.

Ravindra Jadeja : ఇండియన్ మైఖేల్ జాక్సన్ పాట‌కు.. అమెరికా వీధుల్లో ర‌వీంద్ర జ‌డేజా స్టెప్పులు.. వీడియో వైర‌ల్