Suryakumar Yadav: టీ20ల్లో వంద సిక్స్‌ల క్లబ్‌లో సూర్యకుమార్.. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు వీరే ..

సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో 100 సిక్సుల క్లబ్‌లో చేరాడు. 49 ఇన్నింగ్స్‌లో సూర్య ఈ ఘనత సాధించాడు.

Suryakumar Yadav: టీ20ల్లో వంద సిక్స్‌ల క్లబ్‌లో సూర్యకుమార్.. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లు వీరే ..

Suryakumar Yadav

Suryakumar Yadav: సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు అద‌గొట్టారు. సూర్య‌కుమార్ యాద‌వ్ (83; 44 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా తిల‌క్ వ‌ర్మ‌(49 నాటౌట్‌; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌ ) స‌మ‌యోచితంగా రాణించ‌డంతో 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 17.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫ‌లితంగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్ బోణీ కొట్ట‌డంతో పాటు విండీస్ ఆధిక్యాన్ని 2-1కి త‌గ్గించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాలుగు సిక్స్ లు కొట్టడం ద్వారా టీ20 క్రికెట్ లో 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా పూర్తిచేసిన భారతీయుడిగా సూర్యకుమార్ నిలిచాడు.

Hardik Pandya Trolls: హార్ధిక్ మరీ ఇంత స్వార్థమా.. తిలక్‌ వర్మ ఆఫ్ సెంచరీ మిస్.. కెప్టెన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

సూర్యకుమార్ యాదవ్ 49 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు శిఖర్ ధావన్‌ను సూర్యకుమార్ అధిగమించాడు. 49 టీ20ల్లో సూర్యకుమార్ మూడు సెంచరీలు, 14 అర్థ సెంచరీలతో 45.64 సగటుతో 1,780 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోర్ 117 పరుగులు. శిఖర్ ధావన్ 68 మ్యాచ్ లలో 27.92 సగటుతో 1,759 పరుగులు చేశాడు. ధావన్‌కు టీ20ల్లో 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

IND vs WI 3rd T20 : సూర్య‌కుమార్ విధ్వంసం.. బోణీ కొట్టిన భార‌త్‌.. మూడో టీ20లో విజ‌యం

టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన భారతీయులు..

రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్ 182 సిక్సులు)
విరాట్ కోహ్లీ (107 ఇన్నింగ్స్ 117 సిక్సులు)
సూర్యకుమార్ యాదవ్ (49 ఇన్నింగ్స్ 101 సిక్సులు)
కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్ 99 సిక్సులు)
యువరాజ్ సింగ్ (51 ఇన్నింగ్స్ 74 సిక్సులు)
హార్ధిక్ పాండ్యా (70 ఇన్నింగ్స్ 68 సిక్సులు)
సురేష్ రైనా (66 ఇన్నింగ్స్ 58 సిక్సులు)
ఎంఎస్ ధోనీ (85 ఇన్నింగ్స్ 52 సిక్సులు)
శిఖర్ ధావన్ (66 ఇన్నింగ్స్ 50 సిక్సులు)