Roja : మంత్రి పదవి రావడంతో రోజా కీలక నిర్ణయం.. సినిమాలకి, జబర్దస్త్‌కి రోజా గుడ్‌బై..

తాజా మంత్రి వర్గంలో రోజాకి చోటు దక్కడంతో ఇలాంటి కామెంట్లకి తావు ఇవ్వకూడదని, అంతేకాక ఎలక్షన్స్ కి మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో పూర్తిగా ప్రజలపై, రాజకీయాలపై దృష్టి సారించాలని.......

Roja : మంత్రి పదవి రావడంతో రోజా కీలక నిర్ణయం.. సినిమాలకి, జబర్దస్త్‌కి రోజా గుడ్‌బై..

Roja

Roja :  తాజాగా ఏపీలో జగన్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ సారి క్యాబినెట్ లో గతంలో చేసిన వారిలో చాలా మందిని తప్పించి పలువురు కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఈ సారి క్యాబినెట్ లో ఎంతోకాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న నటి, నగరి ఎమ్మెల్యే రోజాకి చోటు దక్కింది. ఈ సారి జగన్ క్యాబినెట్ లో రోజా మంత్రి పదవి దక్కించుకుంది.

ప్రస్తుతం రోజా రాజకీయాలలో బిజీగా ఉంటూనే జబర్దస్త్ మరియు పలు షోలలో కనిపిస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాల్లోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుంది. గతంలో రోజా ఎమ్మెల్యేగా గెలిచాక కూడా జబర్దస్త్ లో పాల్గొని అక్కడ డ్యాన్సులు వేయడంతో అది వివాదంగా మారింది. రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇలాంటివి మానేయాలని కొంతమంది కామెంట్లు చేశారు. గతంలోనే దీనిపై రోజా వివరణ ఇచ్చారు.

Toolsidas Junior : స్నూకర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొదటి సినిమా..

ఇక తాజా మంత్రి వర్గంలో రోజాకి చోటు దక్కడంతో ఇలాంటి కామెంట్లకి తావు ఇవ్వకూడదని, అంతేకాక ఎలక్షన్స్ కి మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో పూర్తిగా ప్రజలపై, రాజకీయాలపై దృష్టి సారించాలని రోజా భావించారు. దీంతో రోజా ప్రస్తుతానికి సినిమాలకి, జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఇది రాజకీయంగా రోజాకి ప్లస్ అయినా రోజా అభిమానులు, ప్రేక్షకులు మాత్రం ఈ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు.

Sunny Leone : పెళ్లి టైంలో చేతిలో డబ్బులు లేవు.. గెస్టులు ఇచ్చిన గిఫ్టులతో రిసెప్షన్ బిల్లులు కట్టాం..

ఇప్పటికే గత కొంతకాలంగా జబర్దస్త్ లో వేరే వేరే సీనియర్ నటీమణులని తీసుకొస్తున్నారు. మరి రోజా వెళ్లిపోవడంతో రోజా ప్లేస్ లో ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక రోజాకి మంత్రి పదవోయ్ రావడంతో జబర్దస్త్ ఆర్టిస్టులు, పలువురు సినీ ప్రముఖులు కూడా అభినందనలు తెలియచేస్తున్నారు. మరి రోజాకి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వనున్నారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.