IPL 2023: ఉప్ప‌ల్‌లో కోహ్లి ఊచ‌కోత‌.. క్లాసెన్ సెంచ‌రీ వృధా.. హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓపెన‌ర్లు దుమ్మురేపారు.విరాట్ కోహ్లి సెంచ‌రీతో ఉతికారేయ‌డంతో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023: ఉప్ప‌ల్‌లో కోహ్లి ఊచ‌కోత‌.. క్లాసెన్ సెంచ‌రీ వృధా.. హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

RCB Win

SRH vs RCB: ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓపెన‌ర్లు దుమ్మురేపారు. విరాట్ కోహ్లి సెంచ‌రీతో ఉతికారేయ‌డంతో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (100; 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా డుప్లెసిస్‌(71; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్ చెరో వికెట్ తీశారు.

IPL 2023: హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు విజ‌యం

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌(104 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. 49 బంతుల్లో ఐపీఎల్‌లో త‌న మొద‌టి శ‌త‌కాన్ని అందుకున్నాడు. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్‌( 27నాటౌట్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అభిషేక్ శ‌ర్మ‌(11), రాహుల్ త్రిపాఠి(15), మార్‌క్ర‌మ్‌(18)లు విఫ‌లం అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, షాబాద్ అహ్మ‌ద్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: ఆర్‌సీబీకి చావోరేవో.. గ‌తం హైద‌రాబాద్‌కు అనుకూలం.. అంద‌రి క‌ళ్లు కోహ్లిపైనే