IPL 2023: హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు విజ‌యం

ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది.

IPL 2023: హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు విజ‌యం

SRH vs RCB

Updated On : May 18, 2023 / 11:00 PM IST

SRH vs RCB: ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 18 May 2023 11:01 PM (IST)

    బెంగ‌ళూరు విజ‌యం

    ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 18 May 2023 10:50 PM (IST)

    విరాట్ కోహ్లి సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌

    ల‌క్ష్య ఛేద‌న‌లో విరాట్ చెల‌రేగి ఆడుతున్నాడు. సెంచ‌రీ చేశాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో(17.4వ ఓవ‌ర్‌) సిక్స్ కొట్టి 62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ చేశాడు. ఆ మ‌రుసటి బంతికే ఔట్ అయ్యాడు.

  • 18 May 2023 10:20 PM (IST)

    కోహ్లి, డుప్లెసిస్ అర్ధ‌శ‌తకాలు

    12వ ఓవ‌ర్‌ను గ్లెన్ ఫిలిప్స్ వేశాడు. తొలి బంతికి రెండు ప‌రుగులు తీసి 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకోగా మూడో బంతికి ఫోర్ కొట్టి విరాట్ కోహ్లి 35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 108/0. విరాట్ కోహ్లి(55), డుప్లెసిస్‌(51)లు క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 09:53 PM (IST)

    ధాటిగా ఆడుతున్న బెంగ‌ళూరు ఓపెన‌ర్లు.. ప‌వ‌ర్ ప్లే

    ల‌క్ష్య ఛేద‌న‌లో బెంగ‌ళూరు ఓపెన‌ర్లు ధాటిగా ఆడుతున్నారు. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి బెంగ‌ళూరు స్కోరు 64/0. విరాట్ కోహ్లి 19 బంతుల్లో 29, డుప్లెసిస్ 17 బంతుల్లో 34 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 09:09 PM (IST)

    బెంగ‌ళూరు ల‌క్ష్యం 187

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌(104; 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) బెంగ‌ళూరు బౌల‌ర్ల‌పై నిర్ధాక్షణ్యంగా విరుచుకుప‌డ్డాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఉప్ప‌ల్‌ను మోతెక్కించాడు. 49 బంతుల్లో ఐపీఎల్‌లో త‌న తొలి శ‌త‌కాన్ని అందుకున్నాడు. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్‌( 27నాటౌట్‌; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అభిషేక్ శ‌ర్మ‌(11), రాహుల్ త్రిపాఠి(15), మార్‌క్ర‌మ్‌(18)లు విఫ‌లం అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, షాబాద్ అహ్మ‌ద్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 18 May 2023 09:00 PM (IST)

    హెన్రిచ్ క్లాసెన్ సెంచ‌రీ

    హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో(18.3వ ఓవ‌ర్‌లో)సిక్స్ కొట్టి క్లాసెన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

  • 18 May 2023 08:42 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు

    15వ ఓవ‌ర్‌ను క‌ర‌ణ్ శ‌ర్మ వేయ‌గా 21 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి రెండు బంతుల‌ను హ్యారీ బ్రూక్ వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్‌గా మ‌ల‌చ‌గా నాలుగో బంతికి క్లాసెన్ సిక్స్ కొట్టాడు. 15 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 133/3. హ్యారీ బ్రూక్ (14), హెన్రిచ్ క్లాసెన్(73) క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 08:32 PM (IST)

    మార్‌క్ర‌మ్ క్లీన్ బౌల్డ్

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 104 ప‌రుగుల(12.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ ప‌డింది. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 104/3. హ్యారీ బ్రూక్ (0), హెన్రిచ్ క్లాసెన్(58) క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 08:23 PM (IST)

    క్లాసెన్ అర్ధ‌శత‌కం

    హెన్రిచ్ క్లాసెన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. క‌ర‌ణ్ శ‌ర్మ బౌలింగ్‌లో సింగిల్ తీసి 24 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

  • 18 May 2023 08:03 PM (IST)

    క్లాసెన్ మూడు ఫోర్లు

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్‌లో పవ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను షాబాజ్ అహ్మద్ వేయ‌గా క్లాసెన్ మూడు ఫోర్లు కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 49/2. ఐడెన్ మార్‌క్ర‌మ్ (2), హెన్రిచ్ క్లాసెన్(20) క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 07:58 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో ఓపెన‌ర్లు ఔట్‌

    మైకేల్ బ్రేస్‌వెల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో ఓపెన‌ర్లు ఇద్ద‌రిని ఔట్ చేశాడు. ఐదో ఓవ‌ర్ వేసిన బ్రేస్ వెల్ మొద‌టి బంతికి అభిషేక్ శ‌ర్మ(11) ఔట్ చేయ‌గా మూడో బంతికి రాహుల్ త్రిపాఠి(15)ని పెవిలియ‌న్‌కు చేర్చాడు.అభిషేక్ శ‌ర్మ క్యాచ్ ను మహిపాల్ లోమ్రోర్ అందుకోగా, త్రిపాఠి.. హ‌ర్ష‌ల్ ప‌టేల్ చేతికి చిక్కాడు. దీంతో 28 ప‌రుగుల‌కే హైద‌రాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు33/2. ఐడెన్ మార్‌క్ర‌మ్ (1), హెన్రిచ్ క్లాసెన్(5) క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 07:36 PM (IST)

    2 ప‌రుగులు

    టాస్ ఓడిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌ను సిరాజ్ వేశాడు. 1 ఓవ‌ర్‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 2/0. అభిషేక్ శర్మ(1), రాహుల్ త్రిపాఠి(0) లు క్రీజులో ఉన్నారు.

  • 18 May 2023 07:14 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీప‌ర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్

  • 18 May 2023 07:13 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్ర‌మ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి

  • 18 May 2023 07:11 PM (IST)

    టాస్ గెలిచిన ఆర్‌సీబీ

    కీల‌క మ్యాచ్‌లో బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైద‌రాబాద్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.