RRR : అమెరికాలో అప్పుడే కలెక్షన్స్ వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’

ఈ విషయంలో 'ఆర్ఆర్ఆర్' ఒక అడుగు ముందుకేసి సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు ఉండగానే అమెరికా థియేటర్స్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంత ముందుగా ఇప్పటివరకు ఏ సినిమా........

RRR : అమెరికాలో అప్పుడే కలెక్షన్స్ వేట మొదలుపెట్టిన ‘ఆర్ఆర్ఆర్’

Rrr

RRR :  స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ అయితే సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ట్రైలర్ చుసిన దగ్గర్నుంచి ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకి కలెక్షన్స్ వచ్చేది ఎక్కువ అమెరికాలోనే. అందుకే తెలుగు సినిమాలు అమెరికా థియేటర్స్ ని కూడా టార్గెట్ చేసుకుంటాయి. ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ ఒక అడుగు ముందుకేసి సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు ఉండగానే అమెరికా థియేటర్స్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంత ముందుగా ఇప్పటివరకు ఏ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అమెరికాలో దాదాపు 1000 మల్టీప్లెక్స్ లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అవ్వనుందని సమాచారం. అమెరికాలో వేరే ఏ భారతీయ సినిమా ఇంత పెద్ద రేంజులో విడుదల కాలేదు.

NANI : సోషల్ మీడియాలో అన్న మాటలకి నా వైఫ్ 10 సూట్స్ కొని పెట్టింది : నాని

అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అయ్యే అన్ని మల్టిప్లెక్స్ లు ముందస్తు బుకింగ్ లను తెరవడంతో అప్పుడే టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఈ టికెట్స్ ప్రీ సేల్స్ దాదాపు రెండు లక్షల డాలర్ల సేల్స్ జరిగాయి. ఇది కూడా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే ఇన్ని డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ‘ఆర్ఆర్ఆర్’. సినిమా విడుదల అవ్వకుండానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుంది అంటే రిలీజ్ టైంకి ఇంకెన్ని కలెక్షన్స్ సాధిస్తుందో ఈ సినిమా. రాజమౌళి 1000 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ పెట్టుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.