RRR: 2022లోని వరల్డ్ టాప్ 50 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’కి చోటు

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే క్రేజ్ దక్కింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఓ చెడుగుడు ఆడుకుంది ఈ మూవీ.

RRR: 2022లోని వరల్డ్ టాప్ 50 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’కి చోటు

RRR Gets Place In IMDB World's Top 50 Films In 2022

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే క్రేజ్ దక్కింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఓ చెడుగుడు ఆడుకుంది ఈ మూవీ.

RRR: మరో ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్..!

ఇక రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా, ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా గ్లోబల్‌గా సందడి చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు అరుదైన అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్, ఆస్కార్ నామినేషన్స్‌కు సైతం వెళ్లింది. ఇదిలా ఉండగా, తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ సినిమా డేటాబేస్ వెబ్‌సైట్ IMDB 2022 సంవత్సరానికి గాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 50 సినిమాలను సెలెక్ట్ చేసింది. ఈ టాప్ 50 సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కూడా చోటు సంపాదించింది.

RRR: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ నయా రికార్డ్.. ఏమిటంటే?

దీనికి సంబంధించి తాజాగా IMDB ఓ వీడియోను రిలీజ్ చేయగా, అందులో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా చూపెట్టారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాల్లో కేవలం 50 టాప్ సినిమాలను ఎంపిక చేసినా, అందులోనూ ఆర్ఆర్ఆర్ ఉండటం విశేషమని చెప్పాలి. గ్లోబల్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ఏదో ఒక ఘనతను సాధిస్తూ ఇంకా వార్తల్లో ఉండటంతో ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి విజయాలను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.